టాలీవుడ్, కోలీవుడ్ ఏ వుడ్ అయినా కూడా లవ్ ఎఫైర్‌లు కామన్.మీడియాలో ప్రచారం జరిగే ప్రేమ వ్యవహారాల్లో సగానికి పైగా పుకార్లు మాత్రమే ఉంటాయి.
తాజాగా తమిళ నటుడు గౌతమ్ కార్తీక్ ప్రేమలో మునిగి తేలుతున్నాడు అని, ఆయన త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది.ఇక ప్రేమలో ఉంది మరెవ్వరితోనో కాదట, తెలుగులో ‘లీడర్’ సినిమాతో సుపరిచితం అయిన ప్రియా ఆనంద్‌తో నట.వీరి ప్రేమ వ్యవహారం తమిళ సినీ వర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది.
తాను ప్రియా ఆనంద్‌తో ప్రేమలో ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను గౌతమ్ కార్తీక్ కొట్టి పారేశాడు.
ఆమెతో సినిమా చేసినంత మాత్రాన ప్రేమలో ఉన్నట్లా అంటూ ప్రశ్నిస్తున్నాడు.ఆమె కేవలం తనకు స్నేహితురాలు మాత్రమే అని, అంతకు మించి మరేం కాదు అంటూ తేల్చి చెప్పాడు.
ఈ వ్యవహారం గురించి ఇటీవలే ప్రియా ఆనంద్ కూడా క్లారిటీ ఇచ్చింది.మరి ఇప్పటికి అయినా కూడా వీరిపై వస్తున్న పుకార్లకు బ్రేక్ పడుతుందేమో చూడాలి.







