బాలయ్యతో ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో నటించిన ముద్దుగుమ్మ రాధిక ఆప్టే గత కొన్ని రోజులుగా మీడియాలో తెగ నానుతూ వస్తోంది.గతంలో ఈమె న్యూడ్‌గా నటించడంలో తప్పేంటి అంటూ హాట్ కామెంట్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత టాలీవుడ్ హీరోలు డామినేషన్ చేస్తారు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.అయితే ఈమె ఇప్పుడు న్యూడ్ సీన్స్‌తో మీడియాకు ఎక్కింది.
ఈమె నటించిన ఒక షార్ట్ ఫిల్మ్‌లో న్యూడ్ సీన్స్ సోషల్ మీడియా, వాట్స్‌యాప్‌లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి.
అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ షార్ట్ ఫిల్మ్‌లోని దాదాపు అయిదు నిమిషాల నిడివి ఉన్న రాధిక ఆప్టే న్యూడ్ సీన్స్ వాట్స్‌యాప్ ద్వారా బయటకు వచ్చాయి.
దాంతో దర్శకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.అయితే తాజాగా ఆ సీన్స్‌ను ఆ చిత్రానికి సంబంధించిన వారే ఎవరో లీక్ చేసి ఉంటారు అని, ఇప్పుడు అది పబ్లిసిటీ కోసం ఉపయోగపడుతుందంటూ బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.
కాని దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాత్రం ఈ లీక్ వీరులు ఎవరైనా వదిలి పెట్టేది లేదు అంటూ గట్టిగానే హెచ్చరిస్తున్నాడు.అసలు విషయం తేలాలంటే పోలీసుల విచారణ సక్రమంగా జరగాల్సి ఉంది.







