బన్నీ మళ్లీ దాంతో కనిపిస్తాడా?

టాలీవుడ్‌ హీరోలు పలువురు ఇప్పటి వరకు సిక్స్‌ ప్యాక్‌తో కనిపించిన విషయం తెల్సిందే.

అయితే మెగా హీరో అల్లు అర్జున్‌ ‘దేశ ముదురు’ సినిమాలో చూపించిన సిక్స్‌ ప్యాక్‌ బాడీకి మంచి స్పందన వచ్చింది.

అప్పటి వరకు పెద్దగా సిక్స్‌ ప్యాక్‌పై ఆసక్తి చూపని టాలీవుడ్‌ హీరోలు బన్నీ సిక్స్‌ ప్యాక్‌ తర్వాత ఆసక్తిని కనబర్చారు.ఆ తర్వాత పలువురు సిక్స్‌ ప్యాక్‌లో కనిపించారు.

అయితే ‘దేశ ముదురు’ సినిమా తర్వాత బన్నీ మరోసారి సిక్స్‌ ప్యాక్‌లో కనిపించింది లేదు.తాను నటించే ప్రతి సినిమాలో కూడా స్టైలిష్‌ లుక్‌లో కనిపించాలని భావించే అల్లు అర్జున్‌ తాజాగా ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాతో ఆకట్టుకున్నాడు.

త్వరలో ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.ఈ సినిమాలో అల్లు అర్జున్‌తో మరోసారి సిక్స్‌ ప్యాక్‌ బాడీతో కనిపించాలని బోయపాటి చెప్పినట్లుగా తెలుస్తోంది.

Advertisement

అందుకోసం బన్నీ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించాడు.ఈ సినిమా వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభం కాబోతుంది.

ఈ సినిమాకు ‘రధం’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు