తెలంగాణ పోలీసులు చాలా తెలివైనవారు.జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు నివేదిక పంపడం కూడా తెలియనివారు.
కమిషన్ కార్యాలయం చిరునామా ఏమిటో తెలియనివారు.అసలు సంగతి ఏమిటంటే….
తెలంగాణలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్‌కౌంటర్‌పై, ఆంధ్రలో జరిగిన ఎర్రచందనం దొంగల ఎన్‌కౌంటర్‌పై సవివరమైన నివేదికలు ఇవ్వాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది.దీంతో గురువారం రెండు రాష్ర్టాల పోలీసు ఉన్నతాధికారులు ఎన్‌కౌంటర్ సమయంలో వినిపించిన ‘కతల’తోనే నివేదికలు పంపారు.
అయితే తెలంగాణ నివేదిక తమకు అందలేదని ఢిల్లీలోని కమిషన్ శుక్రవారం చెప్పింది.నివేదిక పంపినప్పుడు అందకుండా ఉండదు కదా.అందులోనూ పోలీసు డిపార్టుమెంటు నుంచి వెళ్లిన నివేదిక అందకుండా ఎలా ఉంటుంది అని అనుకున్నారు.కాని నివేదిక నిజంగానే అందలేదని తెలియడంతో కంగారుపడి ఆరా తీస్తే పాత చిరునామాకు పంపారట.
ఆ కార్యాలయం మారిన సంగతి పోలీసు అధికారులకు తెలియదట.మళ్లీ కొత్త చిరునామాకు పంపారట.
మానవ హక్కుల కమిషన్‌ను పట్టించుకునేది ఏమిటిలే అనుకొని ఉంటారు.