రుణ మాఫీ సంగతేంటి లోకేష్‌?

ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు రైతులకు రుణ మాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు.

ఆయన పీఠం ఎక్కడానికి ఇతర అనేక కారణాలు ఉన్నప్పటికీ రుణ మాఫీ అనేది ఎక్కువ ప్రభావం చూపించింది.

కాని ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో రుణ మాఫీ జరగలేదు.హామీ ఇచ్చినంత సులభంగా ఆచరణ ఉండదని చంద్రబాబుకు అర్ధమైంది.

రుణ మాఫీ చేస్తానని చెబుతున్నాడేగాని అది ఎలా పూర్తి చేయాలో ఆయనకు అర్ధం కావడంలేదు.అయినప్పటికీ అర చేతిలో స్వర్గం చూపిస్తూనే ఉన్నాడు.

చంద్రబాబు నుంచి ఎలాగూ సరైన సమాధానం రావడంలేదు కదా ఆయన తరువాత పార్టీలో చక్రం తిప్పుతున్న కుమారుడు లోకేష్‌ బాబును అడిగారు పార్టీ కార్యకర్తలు అయ్యా.లోకేష్‌బాబూ రైతు రుణ మాఫీ సంగతేంటీ? అని.మంగళవారం కుప్పంలో ఈ ప్రశ్న ఎదురవగానే లోకేష్‌ ఒక్కసారిగా షాక్‌ తిన్నారట.! లోకేష్‌ కుప్పంలో టీడీపీ కార్యకర్తల సంక్షేమ యాత్రను ప్రారంభించారు.

Advertisement

ఈ సందర్భంగా వారు రున మాఫీ గురించి ప్రశ్నించారు.మరి ఈ ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్పారో తెలియదు.

అయితే లోకేష్‌ చెప్పిన సమాధానం కార్యకర్తలను సంతృప్తిపరచలేదని తెలిసింది.చెప్పిన ప్రకారం రైతుల రుణాలు మాఫీ చేయకుండా ఎన్ని సంక్షేమ యాత్రలు చేస్తే ఏం ప్రయోజనం?.

Advertisement

తాజా వార్తలు