టాలీవుడ్ హీరోలకు సిక్స్ ప్యాక్ మోజు తిరడం లేదు.ఇప్పటికే పలువురు హీరోలు సిక్స్ ప్యాక్‌ను చూపించిన విషయం తెల్సిందే.
తాజాగా ‘టెంపర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సిక్స్ ప్యాక్ బాడీని చూపించడం జరిగింది.అయితే ఎన్టీఆర్ చూపించిన సిక్స్ ప్యాక్‌కు నందమూరి అభిమానులు సంతృప్తి చెందలేదు.
దాంతో తాజాగా మరోసారి సిక్స్ ప్యాక్‌తో కనిపించేందుకు ఎన్టీఆర్ కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.త్వరలో ఎన్టీఆర్ సుకుమార్ దర్శకత్వంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.
ఆ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ బాడీతో యాక్షన్ సన్నివేశాల్లో కనిపించనున్నాడు.
గతంలో సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1’ సినిమాలో మహేష్‌బాబుతో సిక్స్ ప్యాక్ చేయించాలని భావించాడు.
అయితే మొదట మహేష్ ఒప్పుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల డ్రాప్ అయ్యాడు.తాజాగా ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌ను చూపించాలని నిర్ణయించాడు.
అందుకు ఎన్టీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, రోజులో నాలుగు గంటల పాటు జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘ప్రేమతో నాన్నకు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ఇక హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేయడం జరిగింది.







