బాలయ్య ముందే రానున్నాడా?

నందమూరి ఫ్యామిలీ నుండి ఈ సంవత్సరం ఇప్పటికే ‘పటాస్‌’, ‘టెంపర్‌’ సినిమాలు వచ్చాయి.

ఈ రెండు సినిమాలతో కళ్యాణ్‌ రామ్‌ మరియు ఎన్టీఆర్‌లు సూపర్‌ హిట్‌లు అందుకున్నారు.

దాంతో ఇదే సంవత్సరం మరో నందమూరి హీరో బాలకృష్ణ నటించిన ‘లయన్‌’ సినిమా కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవ్వడం ఖాయం అంటూ నందమూరి హీరోలతో పాటు, నందమూరి ఫ్యాన్స్‌ కూడా భారీ ఆశలు పెట్టుకుని ఉన్నారు.భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘లయన్‌’ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌ జరుగుతుంది.

ఈ సినిమా షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కానుంది.ఈ సినిమాను నిన్న మొన్నటి వరకు మే 1న విడుదల చేయాలని అనుకున్నారు.

అయితే అనుకున్న సమయం కంటే కాస్త ముందుగానే ఈ సినిమాను విడుదల చేయాలని దర్శకుడు సత్యదేవ్‌ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.అందుకు బాలయ్య కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

Advertisement

ఏప్రిల్‌ 30న ఈ సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.త్రిష, రాధిక ఆప్టేలు హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమాలో బాలకృష్ణ సీబీఐ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు.

కొన్ని యదార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు