ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అందుకు కారణాలు కూడా చర్చించి అఖిల పక్షం నాయకులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం తో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని , దీనిపై ఎంతవరకైనా పోతామని ఆ నేతలు తెలియచేసారు .

ఈ అంశంపై హైదరాబాద్ లో బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని అనుకున్న సమయానికి అన్ని పార్టీ నేతలు విచ్చేసి మీట్ నిర్వహించారు.ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన చట్టంలో పేర్కొన్నానాటి యూపియే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది .అయితే ఇప్పుడున్న బిజెపి సర్కార్ ముఖం చాటేస్తోంది .స్పష్టత ఇవ్వకుండా దాత వేసే ఆలోచనలోనే సాగుతోంది అని నేతలు దుయ్యబట్టారు .ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వారు మరోసారి డిమాండ్ చేశారు.ఈ మీట్ లో సీపీఎం నేత రాఘవులు, టీడీపీనేత సోమిరెడ్డి, పీసీసీ చీఫ్ రఘువీరా, వై కాపా నేత మైసూరారెడ్డి, జేపీ, చలసాని తదితర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?

తాజా వార్తలు