నోరు విప్పితే చాలు పుట్టెడు అబద్దాలు చెప్పి లేనిపోని భ్రమలు ప్రజలకు కల్పించి గద్దెనెక్కిన కెసిఆర్‌కు గుణపాఠం చేరువలో తప్పదని తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు .తెలంగాణా ప్రజల మనోభావాలపై ఆలోచన చేసినందునే కాంగ్రెస్ నేత సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా ఏర్పాటు చేసారు .
కెసిఆర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నా, ఈమధ్య అంతా తానే తెలంగాణా సాధకుడిని అని చెప్పడానికి సాహసిస్తున్నాడు .ఎన్నికల్లో ప్రజలకు అనేక అమలు చేయలేని హామీలు, వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన కెసిఆర్ హీనపాలకుదయ్యారు .తర్వాత కుటుంబ సభ్యులకే పదవులిచ్చి వారి దోపిడీని చూసి చూడనట్లు ముందుకు పోతున్నారు .అన్ని వర్గ ప్రజలను నిత్యం మభ్యపెడుతు మరిన్ని భూటకపు హామీలు దంచుతున్నారు .;పోరుబాటలో ,ఎన్నికల్లో ఇచ్చిన హామీలు గాలికి వదిలేసిన కెసిఆర్ వైఖరిని అన్ని పార్టీలు ఎండగడుతూనే ఉన్నాయి .అయినా కెసిఆరు లో వీసమెత్తు చలనం లేదు అని భట్టివిక్రమార్క దుయ్యబట్టారు .రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయపంథాలో నడిపిస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.పార్టీ అంటేనే కార్యకర్తలేనని, పనిచేసే వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.







