ఆమ్ ఆద్మీ పార్టీ డిల్లీ మీడియాకు నిత్యం పార్టి గలాటాలతో వార్తల్లో నిలుస్తుండగా, ఆ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నింపాదిగా పార్టీలో అంతా బాగానే ఉందని అంటున్నారు.కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి కూడా మాట్లాడారు .
ఆయన మాటలే పార్టీలో వివాదాలకు కారణం అని ఈసరికే ఆపార్టీలో పలువురు చెబుతూనే ఉన్నారు పార్టీలో అంతా సవ్యంగానే ఉందని, మీడియా ఏమి అడగకుండానే కేజ్రివాల్ చెప్పడం విశేషం .పార్టీ గురుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు , ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తాము సత్వర పరిష్కారం తో విబేదాలు తొలగించుకుంటాము అని కేజ్రీవాల్ ధీమాగా చెప్పారు.కేజ్రివాల్ మీడియా ముచ్చట్లకు ప్రతిపక్షాలు కోడిగుడ్డుపై వెంట్రుకలు ఏరడానికి అవకాసం ఇవ్వకుండా తానే వారికి పార్టీ గురుంచి ఉప్పు అందిస్తుంటాడు అని ఆప్ పార్టీ పెద్దలు పెదాలు విరిచారు
.






