కాంగ్రెస్ పార్టీ ఒక్కోసారి పురిటి పులిని తలపించడం లో ఏమాత్రం వెనుకాడదు .పులి పిల్లలను కనేటప్పుడు కళ్ళు కనిపించవు .
అందువలన పిల్లలనే తెనేసి ఆకలి తీర్చుకుంటుంది .ఆవిధానం లో కాంగ్రెస్ ఒక్కోసారి పార్టీలో వారిని బలిపసువులను చేస్తుంది .ఎందుకో కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చిన చేతులతోనే దాసరి నారాయణరావు ని చెప్పాపెట్టకుండా ఆపదవిలోంచి పీకే పారేసింది .అదో అవమానంగా దాసరి అప్పట్లో ఫీలయ్యారు .ఈలోగా బొగ్గు కుంభకోణం లో పీకలోతు ఇరికించి కాంగ్రెస్ చేతులు దులుపుకుంది .ఆకేసు నీలినీడలు ఈ రోజు ఈడి రూపంలో ఆస్తులు జప్తు వరకు వచ్చింది .దాసరి నారాయణరావుకు సంబంధించిన రూ.రెండు కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసినట్లు వినిపిస్తోంది .యూపీఏ సర్కార్ 2004 నుంచి 2008 దాకా బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాసరి బొగ్గుగనుల కేటాయింపులో జిందాల్ గ్రూపునకు అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ కేసు నమోదు అయ్యింది.అయితే దాసరికి చెందినా సౌభాగ్య లో 2008-11 మధ్య మాత్రమే డెరైక్టర్‌గా ఉన్నానని, జిందాల్ నుంచి సొమ్ము 2011 తర్వాత వచ్చింది కాబట్టి అది అవినీతి కాదని దాసరి వాదన.
ఈడీ అటాచ్ చేసిన వాటిలో రెండు వాహనాలు, 50 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు, దాసరి ఇల్లు ఉన్నాయి.దాసరి వాదనకు సిబి ఐ పట్టించుకోనందునే జప్తు వరకు వెళ్ళింది అని వినిపిస్తోంది







