యంగ్ హీరో నాని ఉగాది పండుగ రోజున తన రెండు సినిమాలను విడుదల చేసిన విషయం తెల్సిందే.చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ‘జెండాపై కపిరాజు’ మరియు ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలు రెండు కూడా ఈనెల 21న పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
మొదట రెండు సినిమాలు ఒకే రోజు వస్తుండటంతో ఆనందాన్ని వ్యక్తం చేసిన నాని, ఇప్పుడు మాత్రం విచారం వ్యక్తం చేస్తున్నాడు.రెండు సినిమాలు కూడా యావరేజ్ టాక్‌ను తెచ్చుకున్నాయి.
దాంతో కలెక్షన్స్‌పై ప్రభావం చూపుతోంది.
రెండు సినిమాలు ఒకే రోజు కాకుండా కనీసం వారం రోజుల గ్యాప్‌లో వచ్చినా కూడా రెండు సినిమాలకు కూడా గౌరవ ప్రధమైన కలెక్షన్స్ వచ్చేవి అంటున్నారు సినీ వర్గాల వారు.
‘జెండాపై కపిరాజు’ మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండగా, ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమా క్లాస్ ప్రేక్షకుల మనస్సులను దోచుకుంటూ ఉంది.ఈ రెండు సినిమాలకు ప్రస్తుతం ప్రేక్షకులు చాలా పలచగా ఉన్నారు.
రెండు సినిమాలకు మరే సినిమా పోటీ లేకపోయినా కూడా కలెక్షన్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.రెండు సినిమాల నిర్మాతలు కూడా ఇప్పుడు చింతిస్తున్నారు.







