దిల్‌రాజుకు అధ్యక్ష పదవి

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన సమయంలో తెలంగాణ సినిమాకు సొంతంగా ఫిల్మ్‌ చాంబర్‌ను ఏర్పాటు చేయడం జరిగింది.తెలంగాణ మూవీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.

 Dil Raju Elected As Telangana Movie Chamber President-TeluguStop.com

ఈ చాంబర్‌కు ప్రముఖ నిర్మాత అయిన దిల్‌రాజును మొదటి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ఈ చాంబర్‌ పని చేస్తుందని కార్యవర్గం సభ్యులు చెబుతున్నారు.

దిల్‌రాజు అధ్యక్షుడు, విజయేందర్‌ రెడ్డి ఉపాధ్యక్షుడు, సానా యాదిరెడ్డి ప్రధాన కార్యదర్శి, సంగ కుమార స్వామి సంయుక్త కార్యదర్శి, చాంబర్‌ సభ్యులుగా అల్లాణి శ్రీధర్‌, సంగిశెట్టి దశరథ, సత్యనారాయణ గౌడ్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు.తెలంగాణ సినిమాను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు రెండు వెల ఎకరాల ప్రభుత్వ భూమిలో సినిమా సిటీని నిర్మించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఇది త్వరిత గతిన పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కొత్తగా ఎన్నికైన చాంబర్‌ పెద్దలు కోరారు.హైదరాబాద్‌లో సినిమాల నిర్మాణానికి అన్ని విధాలుగా మేలుగా ఉంటుందని, అంతా ఇక్కడ షూటింగ్స్‌ జరుపుకోవచ్చు అని ప్రధాన కార్యదర్శి సానా యాదిరెడ్డి అన్నారు.

తెలంగాణ కళాకారుల జీవితాల్లో వెలుగు నింపుతామని కూడా ఈయన చెప్పుకొచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube