మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తాజాగా ‘ముకుంద’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే.మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న ఈ మెగా హీరో తన రెండవ సినిమా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో చేయబోతున్నట్లుగా ప్రకటించాడు.
ఆ తర్వాత పూరి దర్శకత్వంలో ఒక సినిమా ఉంటుందని చెప్పుకొచ్చాడు.అయితే ఈ రెండు సినిమాలే కాకుండా తాజాగా మెగా హీరో మరో సినిమాకు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది.
మలయాళ సూపర్ హిట్ సినిమా ‘బెంగళూరు డేస్’ రీమేక్‌లో ఒక హీరోగా వరుణ్ తేజ్ ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
‘ముకుంద’ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చిన వరుణ్ వచ్చే నెలలో తన రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకు వెళ్లబోతున్నట్లుగా తెలుస్తోంది.
మొదటగా క్రిష్ దర్శకత్వంలో సినిమా కాగా, ఆ తర్వాత రెండవది ‘బెంగళూరు డేస్’ రీమేక్.ఈ రెండు సినిమాలు కూడా ఒకే సారి చిత్రీకరణ జరుపుకుని, కొంత కాలం గ్యాప్‌లోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
దాంతో మెగా ఫ్యాన్స్‌కు వరుణ్ కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలను విడుదల చేసి, సంతోషంలో ముంచబోతున్నాడు.ఈ రెండు సినిమాలు కూడా ఇదే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.







