అక్కినేని అఖిల్ మొదటి సినిమా తాజాగా ప్రారంభం అయిన విషయం తెల్సిందే.ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ సయేషా సైగల్ నటిస్తున్న విషయం తెల్సిందే.
సయేషా సైగల్‌కు సినీ ప్రముఖుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.చక్కని రూపంతో ఈ అమ్మడు స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తోంది.
సయేషా సైగల్ భవిష్యత్తులో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అని సినీ వర్గాల వారు అంటున్నారు.
సయేషా సైగల్‌ను తమ సినిమాల్లో హీరోయిన్‌గా బుక్ చేసుకునేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఒప్పందం ప్రకారం అఖిల్ మూవీ పూర్తి అయ్యే వరకు సయేషా మరో సినిమాకు సైన్ చేయకూడదు.దాంతో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరిపి, అఖిల్ మూవీ పూర్తి అయిన తర్వాత ఆమెతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నారు.
సయేషాతో అఖిల్ తర్వాత చేయబోతున్న హీరో అల్లు అర్జున్ అని ఫిక్స్ అయ్యింది.బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సంవత్సరం చివర్లో అల్లు అర్జున్ ఒక సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ సినిమాలో హీరోయిన్‌గా సయేషా సైగల్‌ను సంప్రదించారు.







