'బర్త్'డే పార్టీకు రాకపోతే ఫైన్ తప్పదా!!

ఇదో వింత న్యూస్.ఎక్కడైనా బర్త్ దాయ్ పార్టీకు వెళ్లకపోతే ఫ్రెండ్స్ చీవాట్లు పెడతారు.

 1500 Fine For A Boy, Who Not Attended Birthday Party-TeluguStop.com

కానీ ఈ వార్త చూస్తే మీరు తప్పక అవాక్కౌటారు.విషయం ఏమిటంటే తన కొడుకు పుట్టిన రోజు వేడుకలకు పిలిస్తే రాలేదనే నెపంతో ఓ మహిళ ఐదేళ్ల బాలుడికి రూ.1500 జరిమానా విధించింది.అంతేగాక చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె బెదిరింపులకు పాల్పడింది.

లండన్ దేశంలో ఆలెక్స్ న్యాష్ అనే బాలుడుకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు.క్రిస్మస్ ముందు ఆ ఫ్రెండ్ పుట్టిన రోజు కావడం ఆలెక్స్ కు పిలుపు వచ్చింది పార్టీకు హాజరుకమ్మని, కానీ, ఆలెక్స్ వెళ్లకపోవడంతో చిన బాలుడి తల్లి జూలీ లారెన్స్‌కు తీవ్ర ఆగ్రహానికి గురయింది.

అలెక్స్ రాకపోవడం వల్ల తనకు అనవసరంగా పెద్ద మొత్తంలో ఖర్చయిందని, రావట్లేదన్న విషయాన్ని ముందుగా ఎందుకు చెప్పలేదని ప్రశ్నించింది.పార్టీ రానందుకు గానూ తాము ఖర్చు చేసిన రూ.1500 (16 పౌండ్లు) చెల్లించాలని అలెక్స్‌కు ఓ ఇన్వాయిస్ పంపింది.కాగా, ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని, ఆ డబ్బు ఆమెకు చెల్లించేది లేదని అలెక్స్ తండ్రి డెరెక్ తేల్చి చెప్పాడు.

అలెక్స్ తన నాయనమ్మ, తాతయ్యలతో గడపాల్సి వచ్చినందునే.అలెక్స్ ఆ పార్టీకి వెళ్లలేకపోయాడని తెలిపాడు.ఈ విషయాన్ని చెబుదామంటే లారెన్స్ ఫోన్ నెంబర్ తమ వద్ద లేదని చెప్పాడు.అయితే తాము ఇచ్చిన ఇన్విటేషన్‌లోనే కాంటాక్ట్‌ నెంబర్‌తో సహాఅన్ని వివరాలు ఉన్నాయని లారెన్స్ చెబుతోంది.

ఏది ఏమైనా ఇలాంటి వింత మనుషులు కూడా ఉంటారు అని ఇలాంటి వార్తలు చూస్తుంటే తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube