గోపాలుడికి సెన్సార్‌ కష్టాలు

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘గోపాల గోపాల’.పవన్‌ కళ్యాణ్‌, వెంకటేష్‌లు కలిసి నటించిన ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని నిర్మాతలు నిర్ణయించారు.

 Censor Troubles For Gopala Gopala Movie-TeluguStop.com

కాగా ఈ సినిమా నేడు సెన్సార్‌ ముందుకు వెళ్లబోతుంది.అయితే చిత్ర నిర్మాతలకు సెన్సార్‌ బోర్డు ఈ సినిమాపై ఎలా స్పందిస్తుందనే భయం మెదులుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు సెన్సార్‌ సర్టిఫికెట్‌ ఇవ్వవద్దంటూ విశ్వ హిందూ పరిషత్‌ సెన్సార్‌ బోర్డును కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేసింది.ఇక ఇతర హిందూ సంఘాల వారు కూడా ఈ సినిమాలో హిందూ వ్యతిరేక సన్నివేశాలున్నాయని, తమ దైవం శ్రీకృష్ణుడిని మోడ్రన్‌గా చూపించి తమ మనోభావాలను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఈ నేపథ్యంలో ‘గోపాల గోపాల’కు సెన్సార్‌ బోర్డు ఎలా సెన్సార్‌ చేయబోతుంది, వారు విధించే షరతులు ఏంటి అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది.అసలు ఈ సినిమాకు సెన్సార్‌ బోర్డు క్లియరెన్స్‌ ఇచ్చేనా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube