పవర్ స్టార్ అభిమానులు, వెంకీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గోపాల- గోపాల చిత్రం జనవరి9న విడుదలకు సిద్దం అయిన విషయం అందరికి తెలిసిందే.అయితే ముందుగా ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చెయ్యాలి అని నిర్ణయించిన చిత్ర యూనిట్ ఆ తరువాత మనసు మార్చుకుని 9వ తేదీకు జరిపింది.
ఒక పక్క ఐ వంటి భారీ చిత్రం బరిలో ఉండగా దిగితే ఇబ్బందులు తప్పవేమో అని ఆలోచనలో పడ్డారు పవర్ స్టార్ ఫ్యాన్స్.ఇక చిత్ర యూనిట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం చాలా బాగా వచ్చింది అని, సూపెర్ హిట్ కావడం ఖాయం అని, అందుకే కాన్ఫిడెన్స్ తో 9న విడుదలకు సిద్దం చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇదిలా ఉంటే ఈ సినిమా పై ఒక వర్గం వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు.తమ మనోభావాలు దెబ్బతిన్నాయి అంటూ.
వారికి సినిమా చూపించాకే విడుదల చెయ్యాలి అని, మరో పక్క చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఈ చిత్రాన్ని విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.మరి ఈ గోపాలుడు అభిమానుల్ని ఎంతవరకు అలరిస్తాడో చూడాలి.







