ఈ సారైనా చిరు అవకాశం ఇస్తాడో లేదో!!!

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం చివరకు ఆయనకు చిరకాల స్వప్నం లాగానే మిగిలిపోయే అవకాశమే ఎక్కువగా ఉంది ఏమో అని అనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.మొన్న ఐ సినిమా ఆడియో వేడుకలో పాల్గొన్న ఆ చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ తాను తెలుగులో డైరెక్ట్ గా ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపాడు.

 Chiru 150th Movie With Shankar??-TeluguStop.com

అయితే ఆయన అలా అన్నాడో లేదో కానీ టాలీవుడ్ లో సరికొత్త పుకార్లు బయలుదేరాయి.శంకర్ 150 చిత్రం చిరుతో చేస్తాడా?? అన్న సందేహం అందరినీ వెంటాడుతుంది.ఇంతవరకు ఎలా ఉన్నా గతంలోనే శంకర్ దర్శకత్వంలో చిరు నటించాల్సి ఉంది.జంటిల్ మ్యాన్ సినిమాలో అర్జున్ కు బదులు చిరు ఉండవలసింది కానీ, అనుకోని కారణాల దృష్ట్యా ఆ సినిమా అర్జున్ తో తెరకెక్కించాడు శంకర్.

ఇక ఆ తరువాత వచ్చిన ఒకే ఒక్కడు సైతం చిరు హీరోగా తెరకెక్కాల్సిన చిత్రమే కానీ ఆ చిత్రానికి సైతం మళ్లీ అర్జున్ పెద్ద దిక్కుగా మారాడు శంకర్ కి.మరి ఇప్పుడు అసలైన సమయం ఆసన్నమయ్యింది.చిరు 150వ సినిమా శంకర్ టేక్ ఆఫ్ చేస్తే బాగానే ఉంటుంది అని టాలీవుడ్ కోడై కూస్తుంది.చూద్దాం ఏమీ జరుగుతుందో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube