ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై తెలుగుదేశం శాసనసభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ నీటి పారుదల శాఖామంత్రి దేవినేని ఉమ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ ఒక చరిత్ర హీణుడు అని, అస్సెంబ్లీ లో జగన్ మాట్లాడిన తీరు చూస్తుంటే జగన్ అవగాహనా రాహిత్యం కొరవడిన రాజకీయ నాయకుడు అని అర్థం అవుతుంది అంటూ ఉమ జగన్ పై మండి పడ్డారు.
సీమాంధ్ర రాజధాని కోసం అహర్నిశలూ కష్ట పడుతున్న చంద్రబాబు మరో భాగ్యనగరాన్ని నిర్మించి చరిత్రలో నిలిచిపోతే, జగన్ ఆక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళి చరిత్ర హీణుడుగా మిలిగిపోవడం ఖాయం అంటూ ఆయన జగన్ పై తనదైన శైలిలో ఫయిర్ అయ్యారు.ఇక రునమాఫీ కు అర్హులైన ఏ రైతైనా తాము రునమాఫీ పొందలేదు అని చెప్పే అవకాశం లేకుండా పక్కాగా రునమాఫీ అమలు చేశామని ఆయన తెలిపారు.
జగన్ కు సత్తా ఉంటే ఏ రైతునైనా అడిగి చూడమని ఆయన జగన్ కు సవాల్ విసిరారు.ఇదంతా ఎలా ఉన్న జగన్ సభలో మరీ అవగాహనా రాహిత్యం లేకుండా ఏమీ మాట్లాడలేదు అన్న సంగతి అందరికి తెలిసిందే.
కాకపోతే అనుభవం కొరవడటం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నా తన స్థాయి మేరకు బాగానే మాట్లాడాడు అని అనుకోవచ్చు.







