‘కొత్త జంట’ చిత్రం విడుదలకు ముందే అల్లు శిరీష్ మరో సినిమా గురించిన అధికారిక ప్రకటన గీతా ఆర్ట్స్ విడుదల చేసింది.పవన్ సాదినేని దర్శకత్వంలో అల్లు శిరీష్ తర్వాతి సినిమా ఉండబోతుందని, ఆ సినిమాలో నిత్యామీనన్ లేదా రెజీనా హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి.
కాని ‘కొత్త జంట’ సినిమా విడుదలై చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు అల్లు హీరో శిరీష్ తన తర్వాత చిత్రం గురించి ఏ విషయం కూడా అధికారికంగా ప్రకటించలేదు.
తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం ప్రకారం అల్లు శిరీష్ కొత్త సినిమా జనవరి మొదటి వారంలో ప్రారంభం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
కొత్త దర్శకుడితో అల్లు శిరీష్ సినిమా తెరకెక్కబోతుంది.ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది.
జనవరిలో ప్రారంభించే ఆ సినిమాను అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్‌లోనే విడుదల చేయాలనుకుంటున్నట్లుగా అల్లు శిరీష్ భావిస్తున్నాడు.సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమా మొత్తం పూర్తి చేయనున్నారట.
ఇప్పటికే ఆలస్యం అయ్యింది, ఇంకా ఆలస్యం చేయడం ఇష్టం లేదని శిరీష్ సన్నిహితులతో చెబుతున్నట్లుగా తెలుస్తోంది.







