పవన్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘గబ్బర్‌సింగ్`2’ మూవీ వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లబోతుంది.ఈ నెలలోనే షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అవ్వాల్సి ఉంది.
కాని కొన్ని కారణాల వల్ల వాయిదా పడ్డట్లుగా తెలుస్తోంది.వచ్చే నెలలోనే పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘గోపాల గోపాల’ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.
అదే సమయంలోనే ‘గబ్బర్‌సింగ్`2’ కూడా షూటింగ్ కార్యక్రమాలు జరుగనున్నాయి.
వచ్చే నెలలో మొదటి షెడ్యూల్ షూటింగ్ జరుగనుంది.
మొదటి షెడ్యూల్ హైదరాబాద్‌లో 10 రోజుల పాటు జరుగనుంది.ఆ తర్వాత ఫిబ్రవరిలో రెండవ షెడ్యూల్ ప్రారంభించనున్నారు.
ఈ సినిమాను శరవేగంగా పూర్తి చేసి వేసవి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా ఇప్పటికే నిర్మాత శరత్ మరార్ ప్రకటించిన విషయం తెల్సిందే.‘పవర్’ ఫేం బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు.
హీరోయిన్‌గా అనీష ఆండ్రోస్ నటించనుంది.ఇక ఈ చిత్రానికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించనున్నాడు.
ఈ సినిమా కోసం పవన్ అభిమానులు మరియు సినీ ప్రేక్షకులు దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు.మొదట ఈ సినిమాకు సంపత్ నందిని దర్శకుడిగా అనుకుని, ఆ తర్వాత బాబీని దర్శకుడిగా ఎంపిక చేసిన విషయం తెల్సిందే.







