సాధారణంగా కొందరు తమ ముఖ చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మార్చుకునేందుకు రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు.కొందరైతే స్కిన్ వైట్నింగ్( Skin Whitening ) కోసం ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు.
ఇంకొందరు తెల్లగా కనిపించేందుకు మేకప్ పై ఆధారపడుతుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్ సీరం ను కనుక వాడడం అలవాటు చేసుకుంటే సహజంగానే మీ ముఖ చర్మం సూపర్ వైట్ గా మారడం ఖాయం.
అందుకోసం ముందుగా ఒక చిన్న బీట్ రూట్( Beetroot ) తీసుకుని పీల్ తొలగించి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అర గ్లాసు బియ్యం నానబెట్టుకున్న వాటర్ ను పోసుకోవాలి.
నార్మల్ వాటర్ కన్నా రైస్ వాటర్( Rice Water ) చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో అద్భుతంగా సాయపడుతుంది.రైస్ వాటర్ కొంచెం హీట్ అయ్యాక అందులో బీట్ రూట్ తురుము, కొన్ని గులాబీ రేకులు( Rose Petals ) వేసి ఒక పది నిమిషాల పాటు చిన్న మంటపై ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక ఈ బీట్ రూట్ రోజ్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, వన్ టీ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేశారంటే మన సీరం అనేది రెడీ అవుతుంది.ఒక బాటిల్ లోకి సీరంను నింపుకొని ఫ్రిజ్ లో స్టోర్ చేసుకోవాలి.

రోజు నైట్ నిద్రించే ముందు మన హోమ్ మేడ్ సీరంను ముఖానికి మెడకు అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.రెగ్యులర్ గా ఈ సీరం ను కనుక వాడారంటే రెండు వారాలు మీరు మీ ఫేస్ లో రిజల్ట్ ను గమనిస్తారు.ఈ సీరం స్కిన్ కలర్ ను ఇంప్రూవ్ చేస్తుంది.
చర్మం తెల్లగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యమైన, మృదువైన స్కిన్ మీ సొంతం చేస్తుంది.
అంతే కాకుండా ఈ సీరం స్కిన్ ఏజింగ్ కి అడ్డుకట్ట వేస్తుంది.చర్మంపై త్వరగా ముడతలు పడకుండా కాపాడుతుంది.
యవ్వనమైన చర్మాన్ని అందిస్తుంది.