భారతీయ విద్యకు గ్లోబల్ డిమాండ్.. ఆన్‌లైన్ స్కూల్స్‌తో కనెక్ట్ అవుతోన్న ఎన్ఆర్ఐ విద్యార్ధులు

ఆధునిక కాలంలో విద్య అనేది భౌగోళికంగా పరిమితం కాలేదు.భారతీయ కుటుంబాలు( Indian families ) ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కొద్దీ, సరిహద్దులను దాటి అందుబాటులో ఉండే నాణ్యమైన భారతీయ విద్య అవసరం పెరుగుతోంది.

 Online Schools Are Transforming Education For Nri Students , Indian Families ,nr-TeluguStop.com

చాలా మంది ప్రవాస భారతీయులు తమ పిల్లలు భారతీయ పాఠ్యాంశాలు, సాంస్కృతిక మూలాలు, విద్యాపరంగా అనుసంధానించబడాలని కోరుకుంటున్నారు.కానీ స్థానిక పాఠశాల ఎంపికలు ఖరీదైనవి, అస్థిరమైనవిగా మారాయి.

ఈ సమయంలో ఆన్‌లైన్ పాఠశాలలు ఎన్ఆర్ఐల విద్యలో విప్లవాత్మిక మార్పులు చేస్తున్నాయి.

ఎన్ఆర్ఐ విద్యార్ధుల నుంచి సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్ ( CBSE, NIOS )వంటి భారతీయ పాఠ్యాంశాల డిమాండ్ అనేక కారణాల వల్ల పెరిగింది.

చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఉన్నత చదువులు లేదా జేఈఈ, నీట్, యూపీఎస్‌సీ ( JEE, NEET, UPSC )వంటి పోటీ పరీక్షల కోసం భారతదేశానికి తిరిగి రావాలని కోరుకుంటున్నారు.భారతీయ విద్యా వ్యవస్ధతో అనుబంధం వలన మార్పు సజావుగా జరుగుతుంది.

యూఏఈ, యూకే, యూఎస్, సింగపూర్ వంటి దేశాలలో విద్య … భారతీయ విద్య కంటే చాలా ఖరీదైనదిగా కావొచ్చు.

Telugu Cbse, Indian, Inmal, Neet, Nios, Nri, Schools, Schools Nri, Upsc-Telugu T

ఎన్ఆర్ఐలు తమ పిలల్లు భారతీయ భాషలలో ప్రావీణ్యాన్ని సాధించాలని, భారతీయ సంప్రదాయాలు, విలువలతో అనుసంధానించబడి ఉండాలని కోరుకుంటున్నారు.సాంప్రదాయ అంతర్జాతీయ పాఠశాలలు కఠినమైన పాఠ్యాంశాలు, పెద్ద తరగతి పరిమాణాలను కలిగి ఉంటాయి.అయితే ఆన్‌లైన్ పాఠశాల విద్య.

వ్యక్తిగత శ్రద్ధ, స్వీయ వేగవంతమైన అభ్యాసం వంటి వాటిని అందిస్తుంది.ఎన్ఆర్ఐ విద్యార్ధులకు ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్, ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే అభ్యాస వాతావరణాన్ని సృష్టించడం ద్వారా సంస్థలు ఈ మార్పుకు నాయకత్వం వహిస్తున్నాయి.

Telugu Cbse, Indian, Inmal, Neet, Nios, Nri, Schools, Schools Nri, Upsc-Telugu T

ట్యూటరింగ్ , అనధికారిక కోచింగ్ ( Tutoring, informal coaching )లాగా కాకుండా ఆన్‌లైన్ పాఠశాలలు.నిర్మాణాత్మక సీబీఎస్ఈ, ఎన్ఐఓఎస్ పాఠ్యాంశాలను అనుసరిస్తున్నాయి.ఈ కార్యక్రమాలు సర్టిఫైడ్ ఉపాధ్యాయులచే అందించబడతాయి.ఎన్ఆర్ఐలు ఎదుర్కొంంటున్న అతిపెద్ద సవాళ్లలో స్థానిక పాఠశాలల్లో విద్యార్ధి- ఉపాధ్యాయ నిష్పత్తి ఎక్కువగా ఉండటం.ఇదే ఆన్‌లైన్ పాఠశాలలు చిన్న తరగతి పరిమాణాలను అందిస్తాయి.ప్రతి విద్యార్ధికి వ్యక్తిగత శ్రద్ధ, ఉపాధ్యాయులతో ప్రత్యక్ష సంబంధం ఉండేలా చూస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube