సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు ఉన్నప్పటికి కొంతమందికి మాత్రమే ఇక్కడ చాలా మంచి గుర్తింపైతే ఉంది.అందులో రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు తనదైన రీతిలో సత్తా చాటుకోడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు.
ఇప్పటికే ఆయన చేసిన బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తంలో తన పేరు మారుమ్రోపోయేలా చేశాయి.ఇండియాలో తనలాంటి దర్శకుడు మరొకరు లేరు అనేంతల గుర్తింపును కూడా సంపాదించిపెట్టాయి.

మరి ఇలాంటి దర్శకుడు నుంచి ఒక సినిమా వస్తుంది అంటే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తి ఎదురుచూసే అవకాశాలైతే ఉన్నాయి.ఇక ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో( Mahesh Babu ) చేస్తున్న సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.ముఖ్యంగా పాన్ వరల్డ్ నేపధ్యంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా విషయంలో ఆయన ఆచితూచి మరి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా మీద భారీ బజ్ ఉన్న నేపధ్యంలో ఆయన చేయబోయే సినిమా ఇలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తోంది అనేది కూడా తెలియాల్సి ఉంది.

అయితే రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో ఒక లేడీ విలన్( Lady Villain ) కూడా ఉండబోతుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి.మరి ఈ విషయం మీద రాజమౌళి ఎలాంటి స్పష్టత ఇవ్వనప్పటికి సోషల్ మీడియాలో మాత్రం ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది… మొత్తానికైతే రాజమౌళి తను చేయబోతున్న ఈ సినిమాతో ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నాడు…మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
.







