సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ పట్టణంలో రాజీవ్ యువ వికాస పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు మీసేవ సెంటర్లకు వెళ్లిన భాగంగా నిరుద్యోగ యువతకు రేషన్ కార్డు రూపంలో బ్రేక్ పడింది.వెబ్ సైట్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడంతో మీకు రేషన్ కార్డు ఉంటేనే ఈ పథకానికి అర్హులవుతారని రేషన్ కార్డ్ లేని వారిని కాంగ్రెస్ సర్కార్ అనర్హులుగా తేల్చిందని మీసేవ సెంటర్ నిర్వాహకులు చెబుతున్నారు.సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత కోసం రూ.6వేల కోట్ల రాయితీ రుణాలు ఇవ్వనున్నారు.
ఒక్కో లబ్ధిదారుడికి సుమారు రూ.4 లక్షల వరకూ రాయితీ రుణం ఉంటుంది.దరఖాస్తులకు ఏప్రిల్ 5వ తేదీ వరకూ గడువిచ్చారు.మరి ఇప్పటికిప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎక్కడి నుంచి తీసుకురావాలని,రేషన్ కార్డు లేని నిరుద్యోగ యువత పరిస్థితి ఏమిటని,తాము ఇక ఈ పథకానికి అర్హులం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
రేషన్ కార్డులు లేని నిరుద్యోగ యువతకు అవకాశం కల్పిస్తుందా లేదా కొత్త రేషన్ కార్డులను మంజూరు చేసి దరఖాస్తు తేదీని పొడిగిస్తుందా అనేది అర్థం కాక అయోమయంలో పడ్డారు.