సీటెల్‌లో ఉంటున్న సాహిల్ గబా( Sahil Gaba ) అనే ఒక ఇండియన్ టెకీ ఇంటర్వ్యూల్లో ఎలా సక్సెస్ అవ్వాలో ఒక సూపర్ టెక్నిక్ చెప్పాడు.సాహిల్ గూగుల్‌లో( Google ) నాలుగేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
తను చెప్పిన ఈ టెక్నిక్ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయగానే వైరల్ అయిపోయింది.షాకింగ్ ఏంటంటే గూగుల్ కూడా వెంటనే స్పందించి అతని సలహాలను మెచ్చుకుంది.
చాలామంది జాబ్ కోసం ట్రై చేసేవాళ్లు ఇంటర్వ్యూ చేసేవాళ్లని ఏదో పెద్ద జడ్జిల్లాగా టెన్షన్ పడిపోతూ చూస్తారు.కానీ సాహిల్ మాత్రం వాళ్లు మనకు హెల్ప్ చేసేవాళ్లు అంటున్నాడు.ఇంటర్వ్యూ చేసేవాళ్లు మనకు ఒక రకంగా మంచి రిసోర్స్ లాంటి వాళ్లంట.“కోడింగ్ ఇంటర్వ్యూ( Coding Interview ) ఏదైనా సరే ఈజీగా కొట్టాలంటే మీకు బెస్ట్ రిసోర్స్ ఎవరంటే.ఇంటర్వ్యూ చేసేవాళ్లే,” అని చెప్పాడు సాహిల్.

ఇంటర్వ్యూ చేసేవాళ్లని మనం ఎలా వాడుకోవచ్చో కూడా చెప్పాడు.కోడింగ్ స్టార్ట్ చేసేముందు డౌట్స్ అడగాలి ఈ ఎన్ఆర్ఐ చెబుతున్నాడు.ముందే క్లారిఫై చేసుకుంటే వాళ్లే హింట్స్ ఇస్తారంట.
మీరు ఎలా ఆలోచిస్తున్నారో చెబితే, మీరు తప్పుదోవలో వెళ్తుంటే వాళ్ళు కరెక్ట్ చేసే ఛాన్స్ ఉంది.రెండు రకాల ఆలోచనలు చెప్పి, ఎందుకు అలా అనుకుంటున్నారో ఎక్స్‌ప్లెయిన్ చేయండి.
అప్పుడు ఇంటర్వ్యూ చేసేవాళ్లు మీకు సాయం చేసేలా హింట్స్ ఇస్తారు.
అమెజాన్ ఇంటర్వ్యూలో తన సొంత అనుభవం కూడా చెప్పాడు సాహిల్.
డైనమిక్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ దగ్గర కాస్త కష్టపడ్డాడు కానీ సైలెంట్ గా ఉండిపోలేదు.రెండు రకాలుగా ఆలోచిస్తున్నానని చెప్పాడు.
ఇంటర్వ్యూ చేసే వ్యక్తి రియాక్షన్ చూసి, కరెక్ట్ దారిలో వెళ్ళడానికి అది హెల్ప్ చేసిందంట.

“ఇంటర్వ్యూ చేసేవాళ్లు కూడా మనుషులే కదా,” అని వాళ్ళకి కూడా మంచిగా మాట్లాడటం అంటే ఇష్టం.మిమ్మల్ని జస్ట్ ఎవాల్యుయేట్ చేయడమే కాదు.” అని సాహిల్ అన్నాడు.సాహిల్ పోస్ట్‌కి నెటిజన్లు బాగా కనెక్ట్ అయ్యారు.గూగుల్ అఫీషియల్ లింక్డ్‌ఇన్ అకౌంట్ నుంచి కూడా రిప్లై వచ్చింది.“సూపర్ టిప్స్ చెప్పావ్ సాహిల్, థాంక్స్,” అని కామెంట్ పెట్టారు.ఆ పోస్ట్‌కి 4.4K లైక్స్‌తో పాటు చాలా డిస్కషన్స్ కూడా జరిగాయి.
చాలామంది ప్రొఫెషనల్స్ సాహిల్ చెప్పిన దానికి అగ్రీ అయ్యారు.“నా పాయింట్ ఆఫ్ వ్యూనే మార్చేశాడు.ఇంటర్వ్యూ చేసేవాళ్ళని ఎప్పుడూ ఇలా స్నేహపూర్వకంగా చూడలేదు” అని ఒక యూజర్ కామెంట్ చేయగా “కరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే ఇంటర్వ్యూ మనకు ఫేవర్‌గా తిప్పుకోవచ్చు.” అని మరొకరు అన్నారు.
“ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే ఏమనుకుంటారో అని భయపడేవాడిని, కానీ ఈ పోస్ట్ నా మైండ్ మార్చేసింది.” అని ఇంకొక యూజర్ కామెంట్ చేశాడు.“నేను రిక్రూటర్‌ని, కాండిడేట్స్ మాతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు చాలా నచ్చుతుంది.” ఒక ఉద్యోగి పేర్కొన్నారు.సాహిల్ చెప్పిన ఈ స్ట్రాటజీ టెక్నికల్ ఇంటర్వ్యూల గురించి కొత్తగా ఆలోచించేలా చేసింది.
ఇంటర్వ్యూ అంటే టెస్ట్ కాదు, టీమ్‌వర్క్ లా ఉంటుందని అనిపించేలా ఉందని ఇతరులు పేర్కొన్నారు.