ఒక్క క్లిక్‌తో జుకర్‌బర్గ్‌కు షాక్ ఇచ్చిన ఇండియన్ ఆఫీసర్.. ఫేస్‌బుక్ ప్లాన్ తుస్సుమనిపించిన వైనం!

2016లో ఫేస్‌బుక్ సంస్థ ఇండియాలో “ఫ్రీ బేసిక్స్”( Free Basics ) అనే ఒక ప్రోగ్రామ్‌ను హడావుడి చేస్తూ ప్రమోట్ చేస్తోంది.ఈ ప్రోగ్రామ్ ద్వారా కొన్ని వెబ్‌సైట్లను ఉచితంగా వాడుకోవచ్చు.

 Sarah Wynn-williams Meta Memoir Exposes How Indian Official Derailed Facebook Fr-TeluguStop.com

కానీ ఇది నెట్ న్యూట్రాలిటీకి( Net Neutrality ) వ్యతిరేకం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.అసలు విషయం ఏంటంటే, నెట్ న్యూట్రాలిటీ అంటే ఇంటర్నెట్ ప్రొవైడర్లు అందరికీ సమానంగా ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి.

కానీ ఫేస్‌బుక్( Facebook ) మాత్రం కొన్ని వెబ్‌సైట్లకు మాత్రమే ఫ్రీ ఇంటర్నెట్ ఇస్తామనడం నెట్ న్యూట్రాలిటీకి విరుద్ధం.

దీనిపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) సీరియస్‌గా రివ్యూ చేస్తోంది.

ఇలాంటి ప్రోగ్రామ్‌లను బ్యాన్ చేయాలా వద్దా అని తేల్చే పనిలో పడింది.ఫేస్‌బుక్ ఊరుకోలేదు.

ఎలాగైనా ట్రాయ్ నిర్ణయాన్ని తమ వైపు తిప్పుకోవాలని ప్రయత్నాలు చేసింది.మార్క్ జుకర్‌బర్గ్, షెరిల్ శాండ్‌బర్గ్ లాంటి టాప్ బాస్‌లు రంగంలోకి దిగారు.

ఇండియాలోని పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులతో, ప్రధాని కార్యాలయంలో కూడా తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ఫేస్‌బుక్ గట్టిగా నమ్మింది.

Telugu Basics, Indian Official, Meta Lawsuit, Net Neutrality, Sarahwynn, Trai, T

అందుకే ఒక భారీ ప్లాన్ వేసింది.మిలియన్ల మంది ఇండియన్ యూజర్లతో ట్రాయ్‌కి మెయిల్స్ పంపేలా చేసింది.అదీ ఆటోమేటెడ్ మెసేజ్‌లతో, ఏకంగా 16 మిలియన్ల మెయిల్స్ వెళ్లాయంటే మామూలు విషయం కాదు.

కానీ ఫేస్‌బుక్ వేసిన ప్లాన్ మొత్తం ఒక్క క్లిక్‌తో తుస్సుమనిపోయింది.ట్రాయ్‌లో ఎవరో ఒక అధికారి, బహుశా చిన్న స్థాయి ఉద్యోగి అయి ఉంటారు.ఫేస్‌బుక్ నుండి వచ్చే మెయిల్స్‌ను బ్లాక్ చేశారు.అంతే, ఫేస్‌బుక్ ప్లాన్ మొత్తం అక్కడితో ఆగిపోయింది.

ట్రాయ్‌కి ఆటోమేటెడ్ మెసేజ్‌ల వరద రావడం ఒక్కసారిగా ఆగిపోయింది.

Telugu Basics, Indian Official, Meta Lawsuit, Net Neutrality, Sarahwynn, Trai, T

ఫేస్‌బుక్‌లో పనిచేసిన సారా విన్-విలియమ్స్( Sarah Wynn-Williams ) అనే మాజీ ఎగ్జిక్యూటివ్ తన కొత్త పుస్తకంలో ఈ విషయాన్ని బయటపెట్టారు.“కేర్‌లెస్ పీపుల్: ఎ కాషనరీ టేల్ ఆఫ్ పవర్, గ్రీడ్, అండ్ లాస్ట్ ఐడియలిజం” అనే పుస్తకంలో ఫేస్‌బుక్ ఎలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో, ఎంతలా దిగజారుతుందో పూసగుచ్చినట్లు వివరించారు.

ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, ఫేస్‌బుక్ ఇండియాలో లీగల్ సమస్యల్లో చిక్కుకుంటే జైలుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్న ఒక మాజీ పోలీస్ కెప్టెన్‌ను కూడా నియమించుకుందట.

ఈ పుస్తకం రావడంతో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటాకు( META ) మండిపోయింది.సారా విన్-విలియమ్స్‌పై కోర్టులో కేసు వేసింది.ఆమె తమ పరువు తీసేలా పుస్తకం రాశారని, ఇకపై ఆమె పుస్తకం గురించి మాట్లాడకూడదని కోర్టు ఆర్డర్ తెచ్చుకుంది.కానీ పుస్తకం అమ్మకాలు మాత్రం ఆగలేదు.

ఎందుకంటే పుస్తకం పబ్లిష్ చేసిన ఫ్లాటిరాన్ బుక్స్‌పై మెటా కేసు వేయలేదు.

మొత్తానికి ఒక్క క్లిక్‌తో ఫేస్‌బుక్ లాంటి పెద్ద కంపెనీ ప్లాన్‌ను ఓ ఇండియన్ ఆఫీసర్ ఎలా తిప్పికొట్టారో చూశారా? టాలెంట్ ఉంటే ఎవరైనా ఏం చేయగలరో ఈ స్టోరీకి మించిన ఎగ్జాంపుల్ ఇంకోటి ఉండదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube