అమెరికాలో గోమాతతో గృహ ప్రవేశం చేసిన భారతీయ కుటుంబం.. వైరల్ వీడియో చూస్తే ఫిదా..

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ( San Francisco, USA )ఒక భారతీయ కుటుంబం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.వాళ్లు కొత్త ఇంటిలోకి అడుగుపెడుతూ సాక్షాత్తూ గోమాతనే ఆహ్వానించారు.

 The Viral Video Of The Indian Family Who Entered The House With A Cow In America-TeluguStop.com

యూఎస్‌లో ఇంట్లోకి ఆవుని తీసుకొచ్చి గృహ ప్రవేశం చేయడం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.ఈ అద్భుతమైన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

ఇన్‌స్టాగ్రామ్‌లోని @bayareacows అనే అకౌంట్ ఈ వీడియోని మొదట పోస్ట్ చేసింది. కాలిఫోర్నియాలోని బే ఏరియాలో( Bay Area of ​​California ) ఉన్న శ్రీ సురభి గో క్షేత్రం అనే గోశాల నుంchi బహుళ అనే ఆవుని ప్రత్యేకంగా తీసుకొచ్చారు.

గత సంవత్సరం దీపావళి రోజున లాత్రాప్, కాలిఫోర్నియాలో జరిగిన ఒక గృహ ప్రవేశ వేడుకలో బహుళకి ఘన స్వాగతం పలికారని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు.

వీడియోలో ఒక పూజారి, అందంగా అలంకరించిన ఆవుని ఇంటి లోపలికి నడిపిస్తూ ఉండటం చూడొచ్చు.ఆవు ఒళ్లంతా పసుపు, కుంకుమలతో బొమ్మలు వేశారు.దాని వీపుపై ఆవు బొమ్మలు ఉన్న ఒక పట్టు వస్త్రం కప్పారు.

సంప్రదాయం ప్రకారం, ఇంట్లోని కార్పెట్ తీసేసి, ఆవు కోసం ప్రత్యేకంగా ఆహారం గిన్నెలో పెట్టారు.ఇంట్లోకి వచ్చిన ఆవు నెమ్మదిగా ఆహారం తింటూ ఉండగా, ఇంటిలోని మహిళలు భక్తి శ్రద్ధలతో పూజ చేశారు.

ఈ ఆచారం వల్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరుస్తాయని, సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు.వీడియో చివర్లో, ఆ కుటుంబ సభ్యులు ఆవు పక్కన నిలబడి ప్రేమగా నిమురుతూ కనిపించారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఒక యూజర్ దీన్ని రీపోస్ట్ చేస్తూ “ఇంట్లోకి ఆవుని తీసుకురావడం నిజంగా ఒక గొప్ప సంప్రదాయం.ఇది ఆశీర్వాదాలను, మంచి శక్తిని ఆహ్వానిస్తుంది” అని కామెంట్ పెట్టారు.మరొకరు “ఈ ఆచారం దీపావళికి మాత్రమేనా? లేక ఇతర శుభ కార్యాలకి కూడా చేయొచ్చా?” అని అడిగారు.ఏది ఏమైనా, ఈ వైరల్ వీడియో ద్వారా భారతీయ సంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడైనా సజీవంగా ఉంటాయని మరోసారి నిరూపితమైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube