టాలీవుడ్ ఇండస్ట్రీలో వైష్ణవి చైతన్యకు( Vaishnavi Chaitanya ) ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.వైష్ణవి చైతన్య తన సినీ కెరీర్ లో భాగంగా ఎన్నో విజయాలను అందుకున్నారు.
పలు వెబ్ సిరీస్ లతో కూడా ఆమె సత్తా చాటారు.బేబీ సినిమా( Baby Movie ) వైష్ణవి చైతన్య కెరీర్ ను మలుపు తిప్పింది.
ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఈ బ్యూటీ నటిస్తున్నారు.అయితే నిర్మాత ఎస్కేఎన్( Producer SKN ) తాజాగా ఒక ఈవెంట్ లో భాగంగా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
మేము ఆ అమ్మాయిలను అభిమానిస్తామని ఎందుకంటే ఆ భాష వచ్చిన అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో ఇటీవలే తెలుసుకున్నామని ఎస్కేఎన్ అన్నారు.ఇకనుంచి వారిని ప్రోత్సహించకూడదని నేను, దర్శకుడు సాయి రాజేశ్ నిర్ణయం తీసుకున్నామని ఎస్కేఎన్ తెలిపారు.
అయితే ఎస్కేఎన్ చేసిన ఈ కామెంట్లు వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేసినవే అని నెట్టింట కామెంట్లు వైరల్ అయ్యాయి.

అయితే ఈ కామెంట్ల గురించి ఎస్కేఎన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.ఈ మధ్య చాలామంది వినోదం కంటే వివాదానికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఏం చేస్తాం చెప్పండి అంటూ చెప్పుకొచ్చారు.ఎక్సేఎన్ వైష్ణవిని టార్గెట్ చేయకపోయినా ఆ కామెంట్లు మాత్రం అదే విధంగా ప్రొజెక్ట్ అయ్యాయని చెప్పవచ్చు.
వైష్ణవి చైతన్య మాత్రం ఈ కామెంట్లపై రియాక్ట్ కాలేదు.

వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటారు.వైష్ణవి చైతన్య ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు సైతం దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.వైష్ణవి చైతన్య రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని సమాచారం అందుతోంది.
వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.వైష్ణవి చైతన్యకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది.