వన్యప్రాణులు, ప్రకృతి వింతలంటే చాలామందికి ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటుంది వారిలో మీరు ఒకరైతే ఈ వీడియో మీరు తప్పనిసరిగా చూడాల్సిందే.ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి శివకుమార్ గంగల్( IFS Shivakumar Gangal ) తాజాగా ఓ అరుదైన వీడియోను షేర్ చేశారు.
అందులో, చెట్ల మధ్య గాల్లో చక్కర్లు కొడుతూ పక్షిని తలపించింది ఓ ఉడుత.( Squirrel ) మామూలుగా ఈ అద్భుతమైన జీవి మన కంటికి అంత తేలిగ్గా కనిపించదు.
అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్( Viral Video ) అవుతోంది.అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
శివకుమార్ గంగల్ సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేస్తూ తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.“రెండేళ్ల క్రితం ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో చేరకముందు ఎవరైనా నాతో ఈ జంతువు ఉందని చెప్తే నేను నవ్వేసేవాడిని.కానీ ఇదిగోండి, ప్రకృతి సృష్టించిన నిజమైన అద్భుతం ఇది, అదే ఎగిరే ఉడుత.ఇది గాల్లోకి ఎగరడం, గాలిలో తేలియాడుతూ మరో చెట్టుపై ల్యాండ్ అవ్వడం చూస్తుంటే.
కళ్లు చెదిరిపోయే అనుభూతి” అని ఆయన రాసుకొచ్చారు.
ఈ వీడియో కేవలం 12 సెకన్లే ఉన్నా.ఓ అద్భుతమైన క్షణాన్ని మాత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపించింది.వీడియో మొదట్లో కాస్త చీకటిగా ఉన్న దృశ్యంలో.
కొమ్మలు లేకుండా బోడిగా ఉన్న చెట్టు కనిపిస్తుంది.ఏమీ కదలకపోవడంతో అక్కడ ఏదో ఉందని వెంటనే కనిపెట్టలేం.
అంతే.ఒక్కసారిగా నిశ్శబ్దం చెదిరిపోతుంది.
ఎగిరే ఉడుత( Flying Squirrel ) ఒక్క ఉదుటున గాల్లోకి దూకుతుంది.
ఆ ఉడుత గాల్లో చాలా సునాయాసంగా గ్లైడ్ చేస్తూ దూసుకుపోతుంది.దాని కాళ్ల మధ్య ఉండే ప్రత్యేకమైన చర్మ పొరను ‘పటేజియం’ అంటారు.ఈ పలుచని చర్మం గాలిలో తేలియాడటానికి, తన కదలికలను నియంత్రించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఎలాంటి కష్టం లేకుండా.గాల్లో అలా విహరిస్తూ, మరో చెట్టుపై పర్ఫెక్ట్‌గా ల్యాండ్ అయిపోతుంది.దీన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు.
‘కన్జర్వేషన్ ఇండియా’ ప్రకారం మన దేశంలో దాదాపు 17 రకాల ఎగిరే ఉడుతలు ఉన్నాయి.అందులో 14 రకాలు ఈశాన్య భారతదేశంలోనే కనిపిస్తాయి.వీటిలో ఇండియన్ జెయింట్ ఫ్లయింగ్ స్క్విరెల్ చాలా పెద్దది, సాధారణంగా అందరికీ కనిపిస్తుంది కూడా.మన దేశంలో ఇంత గొప్ప వన్యప్రాణుల సంపద ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం.