పక్కా కార్యాచరణతో మాదక ద్రవ్యాల నియంత్రణ కలెక్టర్  సందీప్ కుమార్ ఝా

డ్రగ్స్ నియంత్రణకు అవగాహన కార్యక్రమాలతోపాటు విస్తృత తనిఖీల నిర్వహించాలి మాదక ద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించిన కలెక్టర్, హాజరైన ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పక్కా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టిన చర్యలపై ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని కలెక్టర్ శనివారం నిర్వహించారు.

 Sandeep Kumar Jha Is A Narcotics Control Collector With A Proven Track Record ,-TeluguStop.com

జిల్లా నార్కోటిక్ కంట్రోల్  సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్.డి.పి.ఎస్ కేసులు, గంజాయి సాగు నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం నియంత్రణ చర్యలు, మాదక ద్రవ్యాల నివారణ కోసం శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై విస్తృత ప్రచారం వంటి పలు అంశాలపై చర్చించారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని వివరించారు.డ్రగ్స్ నియంత్రణకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.

మాదక ద్రవ్యాల రవాణా, సాగు, వినియోగం నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు.మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి అవసరమైన చికిత్స, కౌన్సిలింగ్ అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ  వైద్యారోగ్య శాఖ అధికారులకు సూచించారు.

అటవీ  శాఖ అధికారులు వారి పరిధిలోని అటవీ భూములు పరిశీలించి గంజాయి సాగు కనిపిస్తే వెంటనే పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలోని ఆసుపత్రులు, మెడికల్ షాపులలో స్టాక్ వివరాలను ప్రతి నెల తనిఖీ చేయాలని సూచించారు.

చెడు అలవాట్ల వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుందన్నారు.మాదక ద్రవ్యాల నియంత్రణ తీసుకోవాల్సిన చర్యల పై జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు.

అనంతరం ఎస్పీ అఖిల్ మహజన్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు.  గంజాయి అరికట్టేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని, అదే సమయంలో డ్రగ్స్, గంజాయి వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నామని అన్నారు.

మన జిల్లాలో గంజాయి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన కిట్లు అందుబాటులో ఉన్నాయని, డ్రంక్ & డ్రైవ్ తరహాలో గంజాయి కిట్లతో తనిఖీలు చేస్తున్నామని,  గంజాయి పాజిటివ్ వచ్చిన వారి నుంచి సరఫరా దారులను పట్టుకుంటున్నామని, గంజాయి రహిత జిల్లాగా సిరిసిల్ల మార్చే క్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు.సమావేశంలో వేములవాడ ఆర్డీవో రాజేశ్వర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, డ్రగ్ ఇన్స్పెక్టర్ భవాని ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube