స్టార్ హీరో బన్నీని అన్ ఫాలో చేసిన రామ్ చరణ్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) సాధారణంగా కూల్ గా ఉంటారనే సంగతి తెలిసిందే.ఎంతో కోపం వస్తే తప్ప రామ్ చరణ్ తన కోపాన్ని బయటపెట్టరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Ram Charan Unfollows Allu Arjun In Instagram Details, Ram Charan, Ram Charan Unf-TeluguStop.com

గత కొంతకాలంగా మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరుగుతోందనే సంగతి తెలిసిందే.గేమ్ ఛేంజర్( Game Changer ) విషయంలో అల్లు అరవింద్( Allu Aravind ) చేసిన కామెంట్లు సైతం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయ్యాయి.

రామ్ చరణ్ బన్నీ వరుసకు బావ బావమరిది అవుతారనే సంగతి తెలిసిందే.అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ ను( Allu Arjun ) ఇన్ స్టాగ్రామ్ లో అన్ ఫాలో చేశారని సమాచారం అందుతోంది.

కారణాలు తెలియవు కాని చరణ్ బన్నీని అన్ ఫాలో చేయడం సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అవుతుండటం గమనార్హం.అయితే రామ్ చరణ్ అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసినా అల్లు శిరీష్ ను మాత్రం ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

Telugu Allu Aravind, Allu Arjun, Game Changer, Allu, Pushpa, Ram Charan, Ramchar

రామ్ చరణ్ రాబోయే రోజుల్లో బన్నీని అన్ ఫాలో చేయడం గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.పుష్ప2, గేమ్ ఛేంజర్ సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో రిలీజ్ కాగా పుష్ప2( Pushpa 2 ) ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్ల విషయంలో నిరాశపరిచింది.పుష్ప2 సినిమాకు రికార్డ్ స్థాయిలో బెనిఫిట్ షోలు ప్రదర్శితం కావడం జరిగింది.

Telugu Allu Aravind, Allu Arjun, Game Changer, Allu, Pushpa, Ram Charan, Ramchar

2024 ఎన్నికల నుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని చాలామంది ఫీలవుతారు.చిరుత యావరేజ్ అనే అర్థం వచ్చేలా అల్లు అరవింద్ చేసిన కామెంట్లు నెట్టింట హాట్ టాపిక్ అయ్యాయి.మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు తాత్కాలికమే అని భవిష్యత్తులో ఈ కుటుంబాలు మళ్లీ కలిసిపోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube