దేశ ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షా పే చర్చ( Pariksha Pe Charcha ) తాజాగా కాస్త వినూత్నంగా నిర్వహించిన విషయం తెలిసిందే.ఇందులో బాలీవుడ్ బ్యూటీ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే( Deepika Padukone ) పాల్గొన్నారు.
అయితే తాజాగా అందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ని ప్రధాన మోడీ నరేంద్ర మోడీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసారు.ఇందులో దీపిక మాట్లాడుతూ.
తాను మానసిక ఆందోళనకు గురైన ఆ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు.ఆ సమయంలో తాను చాలా కుంగిపోయానని, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవని తెలిపారు.

ఒత్తిడిని జయించడం, మానసిక ఆరోగ్యం పైనా విద్యార్థులకు ఆమె సలహాలు ఇచ్చారు.ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ.స్కూల్ చదువు నుంచి క్రీడల వైపు అక్కడి నుంచి మోడలింగ్, ఆ తర్వాత యాక్టింగ్.ఇలా నా జీవితంలో ఎన్నో మార్పులను చూశాను.ఆ సమయంలో నన్ను నేను మోటివేట్ చేసుకుంటూనే వచ్చాను.2014 వరకు అంతా బాగానే ఉంది కానీ, ఆ తర్వాత ఓసారి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాను.అప్పుడే నేను కుంగుబాటు సమస్యతో బాధపడుతున్నట్లు తెలిసింది.ఈ ఒత్తిడి అనే సమస్య కంటికి కన్పించదు గానీ, మనల్ని అనుక్షణం దెబ్బతీస్తుంది.మన చుట్టూ ఈ సమస్యతో బాధపడేవారు ఉండే ఉంటారు.

కానీ ఆ విషయం మనకు తెలియదు.ఎందుకంటే పైకి వారు సాధారణ మనుషుల్లానే కన్పిస్తారు.నేను ముంబయిలో( Mumbai ) ఒంటరిగా ఉండటం వల్ల చాలా కాలంపాటు కుంగుబాటు సమస్యను ఎవరితోనూ చెప్పలేదు.
ఒక సారి మా అమ్మ ముంబయికి వచ్చి తిరిగెళ్తున్నప్పుడు నేను ఏడ్చేశాను.అప్పుడే నా బాధను తొలిసారి అమ్మతో పంచుకున్నాను.నిస్సహాయ స్థితిలో ఉన్నాను.నాకు జీవితంపై ఆశ లేదు.
బతకాలని లేదు అని తనకు చెప్పాను అప్పుడు ఆమె నన్ను సైకాలజిస్ట్ వద్దకు వెళ్లమని ప్రోత్సహించింది అని దీపిక ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు.