తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు( MLC Elections ) ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.తెలంగాణలో( Telangana ) రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడింది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది.మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు.
ఎన్నికలు జరిగే జిల్లాల్లో తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు కానుందని ఎన్నికల కమిషన్( Election Commission ) స్పష్టం చేసింది.
![Telugu Andhra Pradesh, Conduct, Mlc, Schedule, Telangana, Vote-Latest News - Tel Telugu Andhra Pradesh, Conduct, Mlc, Schedule, Telangana, Vote-Latest News - Tel](https://telugustop.com/wp-content/uploads/2025/01/Schedule-of-MLC-elections-in-ap-and-telangana-released-detailsd.jpg)
తెలంగాణలో మెదక్-నిజామాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( MLC Jeevan Reddy ) పదవీకాలం మార్చి 29న ముగియనుంది.అలాగే, మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ కూర రఘు ఉత్తమ, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి( MLC Alugubelli Narsi Reddy ) పదవీకాలం కూడా మార్చి 29న ముగియనుంది.ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో మార్చి 3వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా మిగతా ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
![Telugu Andhra Pradesh, Conduct, Mlc, Schedule, Telangana, Vote-Latest News - Tel Telugu Andhra Pradesh, Conduct, Mlc, Schedule, Telangana, Vote-Latest News - Tel](https://telugustop.com/wp-content/uploads/2025/01/Schedule-of-MLC-elections-in-ap-and-telangana-released-detailsa.jpg)
మరోవైపు ఆంధ్రప్రదేశ్లో( Andhra Pradesh ) రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేసి, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు.మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు కృష్ణ-గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు( DV Raghavulu ) పేరు ఖరారు చేశారు.
కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పేరు ప్రకటించారు.ఈ ఎన్నికలు ఉభయ రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.