ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో మార్చి 3వ తేదీ వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ మినహా మిగతా ఏడు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుంది.
"""/" /
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో( Andhra Pradesh ) రెండు గ్రాడ్యుయేట్, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల చేసి, ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు.మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గంతో పాటు కృష్ణ-గుంటూరు జిల్లాలకు చెందిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
ప్రస్తుత ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగియనుండటంతో ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పీడీఎఫ్ అభ్యర్థిగా డీవీ రాఘవులు( DV Raghavulu ) పేరు ఖరారు చేశారు.
కూటమి తరఫున టీడీపీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖరం పేరు ప్రకటించారు.ఈ ఎన్నికలు ఉభయ రాష్ట్రాల్లో రాజకీయంగా కీలకంగా మారనున్నాయి.
ఆ హీరోయిన్ వల్లే నా డ్యాన్స్ ఇంప్రూవ్ అయింది.. చైతన్య షాకింగ్ కామెంట్స్ వైరల్!