మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ) ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది స్టార్ డైరెక్టర్ శంకర్( Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించిన ఈ సినిమా పై అభిమానులలో ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి.ఇలా ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల అంచనాలను చేరుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పాలి.
తద్వారా ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఐపీఎస్ కలెక్టర్ ముఖ్యమంత్రి అంటూ వివిధ పాత్రలలో కనిపించారు.
![Telugu Game Changer, Ram Charan, Ramcharan, Ramgopal, Ramgopal Varma, Shankar, S Telugu Game Changer, Ram Charan, Ramcharan, Ramgopal, Ramgopal Varma, Shankar, S](https://telugustop.com/wp-content/uploads/2025/01/Ramgopal-varma-gives-game-changer-movie-review-detailss.jpg)
ఇలా రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నటించారు అయినప్పటికీ కూడా ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.అయితే ఈ సినిమా ఎందుకు సక్సెస్ అందుకోలేకపోయిందనే విషయం గురించి ప్రముఖ సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ) తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.గేమ్ చేంజెర్ సినిమా గురించి వర్మ మాట్లాడుతూ… ఈ సినిమా ఫెయిల్యూర్ కావడానికి ఒక లాజిక్ మిస్ అయింది అని మాట్లాడారు.
![Telugu Game Changer, Ram Charan, Ramcharan, Ramgopal, Ramgopal Varma, Shankar, S Telugu Game Changer, Ram Charan, Ramcharan, Ramgopal, Ramgopal Varma, Shankar, S](https://telugustop.com/wp-content/uploads/2025/01/Ramgopal-varma-gives-game-changer-movie-review-detailsa.jpg)
సాధారణంగా శంకర్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే ఆయన సినిమాలో ఒక బలమైన పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ చుట్టూనే సినిమా కథ మొత్తం నడుస్తుంది.ఒకే ఒక్కడు సినిమాలో ఒకరోజు సీఎం అవ్వడం అనేది చాలా బలమైన పాయింట్ ఆ పాయింట్ చుట్టూనే సినిమా తిరిగింది.ఇక రోబో సినిమాలో రోబో అనేది ఒక బలమైన పాయింట్.
రోబో కి ప్రేమ పుట్టడం అనేది మరొక ఆసక్తికరమైన విషయం అని చెప్పాలి.అయితే గేమ్ ఛేంజర్ సినిమాలో శంకర్ ఈ పాయింట్ మిస్ అయ్యారని వర్మ తెలిపారు.
శంకర్ బలమైన సీడ్ వేయలేదు.బలమైన పునాది లేకపోతే ఏదైనా ఎప్పుడు కూలుతుందో అర్థం కాదు.
రామ్ చరణ్ సినిమా విషయంలో అదే జరిగింది అంటూ వర్మ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.