టాలీవుడ్ స్టార్ట్ హీరోయిన్ సమంత( Samantha ) గురించి మనందరికీ తెలిసిందే.సమంత ప్రస్తుతం కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేస్తూ మరోవైపు తన ఆరోగ్య పరిస్థితుల గురించి జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఇటీవలే సమంత మయోసైటిస్ ఆరోగ్య సమస్యను( Myositis ) ఎదుర్కొన్న విషయం తెలిసిందే.నెమ్మదిగా ఆ సమస్య నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ వచ్చింది.ఇక ఆమెకు సన్నిహితులుగా ఉండే అతికొద్ది మంది చాలా సపోర్ట్ గా ఉన్నారట.అయితే ఇటీవల ఆమె జీవితంలో ఒక ముఖ్య వ్యక్తి, రాహుల్ ( Rahul )తన పాత్రను ఎంత గొప్పగా నిర్వర్తించాడో చెప్పుకొచ్చారు.17 ఏళ్ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ, రాహుల్ తనకు ఎంత ప్రత్యేకమైనవాడో సమంతా తెలిపింది.
మయోసిటిస్ చికిత్స సమయంలో అతను ప్రతీరోజూ ఆమెను పరామర్శించేందుకు వచ్చేవారట.కొద్దీ సమయాన్ని సరదాగా గడిపించేందుకు ఆటలు ఆడిస్తూ, సమంతను ఆలోచనల నుండి తప్పించి ఉల్లాసంగా ఉండేలా చూసేవారని తెలిపారు.ఈ మేరకు సమంత రాహుల్ గురించిమాట్లాడుతూ.ఆ సమయంలో నా ఇంటికి ప్రతీరోజూ వచ్చి నన్ను ఆటలతో, చిట్‌చాట్ తో అలరిస్తూ, నాకు మళ్లీ పని చేసే ఉత్సాహాన్ని కలిగించాడు అని సమంతా ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
రాహుల్ వంటి స్నేహితులు జీవితంలో దొరకడం నిజంగా అదృష్టం అని ఆమె అభిప్రాయపడింది.సమంతా కెరీర్ ప్రారంభంలోనే సింగర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో మంచి బాండింగ్ ఏర్పడింది.
సమంత నటించిన చాలా సినిమాలకు డబ్బింగ్ చెప్పింది చిన్మయి.ఇక ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది.ఆ స్నేహం ఇప్పటికీ కొనసాగుతుండటంతో, చిన్మయి( Chinmai ) ఆమెకు మరొక కీలక మద్దతుగా నిలిచిందని చెప్పుకోవచ్చు.సమంతా వ్యక్తిగత జీవితంలో, రాహుల్, చిన్మయి వంటి వ్యక్తులు ఆమెను గట్టిగా నిలబెట్టడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి.
మయోసిటిస్ వంటి వ్యాధి కారణంగా శారీరకంగా దెబ్బతిన్న సమంతా, మానసికంగా కూడా కుంగిపోతున్న సమయంలో రాహుల్ ఆమెను ప్రోత్సహించడం, మళ్లీ జీవితం పట్ల ధైర్యాన్ని కలిగించడం ఎంతో ప్రత్యేకం అని చెప్పాలి.