బుల్లితెరపై డిజాస్టర్ గా నిలిచిన కల్కి 2898 ఏడీ మూవీ.. రేటింగ్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బోలెడు పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

 Prabhas Kalki 2898 Ad An Epic Disaster On Tv, Prabhas, Kalki 2898 Ad, Epic Disas-TeluguStop.com

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న హీరోలలో మొదటి స్థానంలో ఉన్నారు డార్లింగ్ ప్రభాస్.ఇకపోతే ప్రభాస్ చివరిగా సలార్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

త్వరలోనే రాజా సాబ్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు.కాగా ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా గత ఏడాది విడుదలైన విషయం తెలిసిందే.

Telugu Epic Disaster, Kalki Ad, Prabhas, Prabhaskalki, Tollywood-Movie

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్ల కలెక్షన్లను దాటి సరికొత్త చరిత్రను లిఖించింది.అలాగే ఓటీటీ లోనూ రూ.375 కోట్లకు అమ్ముడుపోయి అన్ని సినిమాల కంటే ఎక్కువ ధరలకు అమ్ముడుపోయిన సినిమాగా చరిత్ర సృష్టించింది.కానీ ఒక దగ్గర ప్రభాస్ ఫ్యాన్స్ పట్టించుకోలేదు.ఎపిక్ డిజాస్టర్ చేశారు.అది ఎక్కడో వేరే భాషలోనో, దేశంలోనో కాదు తెలుగులోనే.అదేంటి ప్రభాస్ యావరేజ్ సినిమానే సూపర్ హిట్ గా నిలిపే తెలుగోళ్ళే ఆయన సినిమాని డిజాస్టర్ చేయడం ఏంటని అనుకుంటున్నారా! నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమాని జనవరి 12న టీవీల్లో ఫస్ట్ టైమ్ టెలికాస్ట్ చేశారు.

Telugu Epic Disaster, Kalki Ad, Prabhas, Prabhaskalki, Tollywood-Movie

సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది.కానీ ప్రభాస్ విషయంలో అది ఫెయిల్ అయ్యింది.ఈ సినిమా టెలివిజన్ రైట్స్ ని జీ తెలుగు భారీ ధరకు సొంతం చేసుకుంది.షోని టెలికాస్ట్ చేసే ముందే పోస్టర్లు, భారీ ప్రకటనలతో పెద్ద ప్రచారమే నిర్వహించారు.

కానీ టీవీలో రిలీజ్ చేసిన తర్వాత ఒక్క ప్రేక్షకుడు కూడా సరిగ్గా పట్టించుకోలేదు.ఈ సినిమాకి కేవలం 5.26 టీఆర్పీ వచ్చింది.ఈ భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమాకి ఇంతా రేటింగ్ వస్తే డిజాస్టర్ అంటారు.ఇప్పటివరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమా 29.4 రేటింగ్ తో సంచలన రికార్డ్ క్రియేట్ చేసింది.ఆ తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా 23.4 రేటింగ్ తో రెండో స్థానంలో నిలిచింది.ఆ తర్వాతి స్థానాల్లో పుష్ప-1, హనుమాన్, గుంటూరు కారం సినిమాలు నిలిచాయి.వీటితో పోల్చుకుంటే కల్కి సినిమాని ఎపిక్ డిజాస్టర్ అనే అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube