ఆస్ట్రేలియాలో ఓ మహిళ తన భర్త మోసాన్ని తెలివిగా బయటపెట్టింది.ఆమె తమ సూపర్ మార్కెట్ రివార్డ్స్ ప్రోగ్రామ్ ద్వారా భర్త మోసం చేస్తున్నట్లుగా తెలుసుకుంది.
ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కాస్ చెప్పిన వివరాల ప్రకారం, క్వీన్స్‌లాండ్‌లో నివసిస్తున్న ఆ మహిళ తన భర్త ప్రవర్తనలో మార్పులు గమనించింది.అతను తరచూ న్యూ సౌత్ వేల్స్‌కి వెళ్తున్నానని చెప్పేవాడు, అది కూడా కుటుంబ సభ్యులను కలవడానికేనని బుకాయించేవాడు.
ఇదివరకు ఎప్పుడూ అంతగా వెళ్లని అతను, ఇప్పుడు మాత్రం తెగ తిరుగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది.
అనుమానం వచ్చిన వెంటనే భార్య అలర్ట్ అయ్యింది.
వారిద్దరి ఉమ్మడి బ్యాంకు ఖాతాను పరిశీలించగా, అందులో కోల్స్ (Coles) అనే సూపర్ మార్కెట్, బన్నింగ్స్ (Bunnings) అనే హార్డ్‌వేర్ స్టోర్లలో డబ్బులు డ్రా చేసినట్లు కనిపించింది.కానీ ఏ లొకేషన్‌లో డ్రా చేశారనే వివరాలు మాత్రం లేవు.
దీంతో భార్య అయోమయంలో పడిపోయింది.అప్పుడే రంగంలోకి దిగింది ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ కాస్.
ఆమె వారిద్దరి జాయింట్ రివార్డ్స్ ఖాతా, అంటే ఫ్లైబైస్ (Flybuys) వంటి వాటిని పరిశీలించమని సూచించింది.అంతే, భార్యకు అసలు విషయం బోధపడింది.
ఫ్లైబైస్ ఖాతాలో(Flybys account) ఆ లావాదేవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి.ఏయే సబర్బ్‌లలో ఆ కొనుగోళ్లు జరిగాయో స్పష్టంగా కనిపించింది.షాకింగ్ విషయం ఏంటంటే, ఆ స్టోర్లు అన్నీ క్వీన్స్‌లాండ్‌లోని ఓ సబర్బ్‌లో ఉన్నాయి.మరెక్కడో కాదు, అది ఆమె భర్త పాత గర్ల్‌ఫ్రెండ్ నివసించే ప్రాంతం, దీంతో భార్య అనుమానించింది నిజమని తేలిపోయింది.

ఇదిలా ఉండగా, మరో వీడియోలో కాస్ చీటింగ్ చేసే పార్ట్‌నర్స్‌ను పట్టుకోవడానికి ఒక చిట్కాను కూడా పంచుకుంది.అనుమానం వస్తే వారి ఫోన్ తీసుకుని, అందులో అనుమానాస్పద మెసేజ్‌లు లేదా ఎమోజీల కోసం చూడమని సలహా ఇచ్చింది.ఒక ఉదాహరణగా, ఒక మహిళ తన భర్త తనకు ఎప్పుడూ పంపని వంకాయ ఎమోజీని (లైంగిక భావనలు కలిగిన సంకేతంగా వాడుతారు) వేరే వ్యక్తికి పంపినట్లు గుర్తించింది.

కాస్ స్వయంగా ఒక మహిళా నేతృత్వంలోని ఇన్వెస్టిగేటివ్ సంస్థను నడుపుతోంది.ఈ సంస్థ మహిళలకు బ్యాక్‌గ్రౌండ్ చెక్‌లు, మొబైల్ సర్వైలెన్స్, సోషల్ మీడియా, డేటింగ్ ప్రొఫైల్స్‌పై డీప్ డైవ్ వంటి సేవలను అందిస్తుంది.ఈ ఘటన ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు.చాలామంది భార్య తెలివితేటలను మెచ్చుకోగా, మరికొందరు భర్త చౌకబారుతనాన్ని, నిర్లక్ష్యాన్ని ఎగతాళి చేశారు.“డబ్బులు ఆదా చేయబోయి, భార్యనే పోగొట్టుకున్నాడు.” అంటూ కామెంట్లు చేశారు.







