జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) రాజీనామా నేపథ్యంలో కెనడాలో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే.తదుపరి లిబరల్ పార్టీ నేత, ప్రధాని ఎవరు అనేది ఉత్కంఠగా మారింది.
ఈ అత్యున్నత పదవి రేసులో పలువురు నేతలు పేర్లు వినిపించగా.వారిలో భారత సంతతికి చెందిన అనితా ఆనంద్ కూడా ఒకరు.
అయితే అనూహ్యంగా ఆమె ప్రధాని రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.అంతేకాదు తాను పార్లమెంట్‌కు తిరిగి ఎన్నిక కావాలనే ఉద్దేశం లేదని తెలిపారు.
ప్రధాని జస్టిన్ ట్రూడో సిద్ధాంతాలను అనుసరిస్తానని .విద్యారంగంలో తిరిగి అడుగుపెడతానని అనితా ఆనంద్( Anita Anand ) స్పష్టం చేశారు.అలాగే తన జీవితంలో తదుపరి అధ్యాయాన్ని ప్రారంభిస్తానని కెనడా రవాణా మంత్రిగా ఉన్న అనిత శనివారం మధ్యాహ్నం వెల్లడించారు.కాగా. విదేశాంగ మంత్రి మెలానీ జోలీ( Foreign Minister Melanie Jolie ), ఆర్ధిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌లు కూడా ఇప్పటికే ప్రధాని రేసు నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.
వ్యాపార, ఆర్ధిక చట్టంలో నిపుణురాలైన అనితా ఆనంద్ రాజకీయాల్లోకి రావడానికి ముందు టొరంటో యూనివర్సిటీలో న్యాయ శాస్త్రంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు.తర్వాత 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించి 2019లో ఒంటారియోలోని ఓక్‌విల్లే నుంచి ఎంపీగా ఎన్నికయ్యే ముందు అమెరికాలోని యేల్ వర్సిటీలో విజిటింగ్ లెక్చరర్‌గానూ ఆమె సేవలందించారు.ట్రూడో కేబినెట్‌లో తొలుత ప్రజాసేవల మంత్రిగా, తర్వాత రక్షణ మంత్రిగా పనిచేశారు.
గతేడాది రవాణా, అంతర్గత వాణిజ్య వ్యవహారాల మంత్రిగా అనితా ఆనంద్ బాధ్యతలు చేపట్టారు.
అనితా ఆనంద్ .తల్లి పంజాబ్‌కు చెందిన డాక్టర్ సరోజ్ దౌలత్ రామ్( Dr.Saroj Daulat Ram ), తండ్రి తమిళనాడుకు చెందిన డాక్టర్ సుందర్ వివేక్ ఆనంద్.వీరికి ఐర్లాండ్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఇంగ్లాండ్‌లో పెళ్లి చేసుకున్నారు.భారత్, నైజీరియాలలో నివసించిన వీరు 1965 నుంచి కెనడాలో స్థిరపడ్డారు.ఇప్పటికీ వీరి బంధువులు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరులలో ఉన్నారు.అనిత తాతగారు భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు.