డిస్ట్రిక్ట్ డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో 26.437 కేజీల గంజాయిని కాల్చి బూడిద చేసిన పోలీసులు..

రాజన్న సిరిసిల్ల జిల్లా: మానకొండూర్ మండలం ఈదులగట్టపల్లి నందుగల వెంకటరమణ ఇన్సినేటర్స్ కామన్ బయో మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ లో నేషనల్ డ్రగ్ డిస్పోజల్ లో భాగంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లో నమోదు కాబడిన 83 కేసులలో స్వాదీనపరచుకున్న 26 కిలోల 437 గ్రాముల నిషేధిత గంజాయిని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో శాస్త్రీయ పద్దతిలో తగులబెట్టడం జరిగింది.

 Police Burnt Ganja Under The Direction Of The District Drugs Disposal Committee,-TeluguStop.com

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమస్య గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు యువత బానిసలుగా మారి తమ అమూల్యమైన భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని అన్నారు.

జిల్లాలో గంజాయి రవాణాను పోలీసులు సమర్థవంతంగా నిరోధిస్తున్నారని అన్నారు.జిల్లాలోని పోలీసుల స్వాధీనంలో ఉన్న మిగతా గంజాయిని కూడా విడతల వారీగా చట్ట ప్రకారం తగులబెట్టుట జరుగుతుందని తెలియజేసారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలను రవాణా చేసే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.ఎస్పీ వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య,డిసిర్బీ సి.ఐ శ్రీనివాస్, ఆర్.ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube