రాజన్న సిరిసిల్ల జిల్లా :ఓపెన్ జిమ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, వ్యాయామం వల్ల ఆరోగ్యాంగా ఉంటారని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్.సాబేర బేగం -గౌస్ అన్నారు.
ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట 3 లక్షల రూపాయల ఎంపీ నిధులతో నిర్మించిన ఓపెన్ జిమ్ ను ఏఎంసీ చైర్మన్ షేక్ సాబేరా బేగం , తాజా మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం లు కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా షేక్ సాబేరా బేగం మాట్లాడుతూ ఆరోగ్యం అన్ని సంపదల కంటే గొప్పదని,ఆరోగ్యంగా ఉంటే మనిషి ఏదయినా సాధించగలరని అన్నారు.
ప్రతిరోజు వ్యాయామం చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఎంపి నిధులతో గ్రామ ప్రజల ఆరోగ్యానికి ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ఉపయోగించుకొని ఆరోగ్యవంతులుగా జీవించాలని కోరారు.
అనంతరం తాజా మాజీ సర్పంచ్ మేడిపల్లి దేవానందం మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం శాసనసభ్యులు తన సోదరుడు మేడిపల్లి సత్యం తన స్వగ్రామమైన కోరుట్లపేట గ్రామంలో మురికి కాలువల నిర్మాణానికి 17 లక్షలు,జిమ్ కోసం 3 లక్షలు ఎంపీ నిధుల నుండి 20 లక్షలు మంజూరు చేయించారని, ఈ మంజూరుకు తన సోదరుడు సత్యం కు తనతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎస్.కె, సాహెబ్,కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్ , పందిర్ల లింగం గౌడ్, మాజీ సర్పంచ్ లు కొండాపురం బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మేడిపల్లి రవి, శెట్టి పెళ్లి బాలయ్య, మెండే శ్రీనివాస్ యాదవ్,ఎల్లారెడ్డిపేట పట్టణ అద్యక్షులు చెన్ని బాబు, నాయకులు కొండాపురం శ్రీనివాస్ రెడ్డి,బండారి బాల్ రెడ్డి,నంది కిషన్,పందిర్ల సుధాకర్ గౌడ్,గుర్రపు రాములు,గంట బుచ్చా గౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, సిర్రం నాగరాజు యాదవ్ ,లోకూర్తి బాలమల్లు , రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, భూఫాల్, అనిల్ , రాజశేఖర్ రెడ్డి, రమేష్ రెడ్డి, సత్యనారాయణ, రంజిత్ గౌడ్, స్వామి గౌడ్, పెద్ద ఎల్లయ్య, ముత్తయ్య, సాయిలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.







