సంధ్య థియేటర్ లో పవన్ కళ్యాణ్ రికార్డును బ్రేక్ చేసిన బన్నీ.. ఏం జరిగిందంటే?

పుష్ప ది రూల్( Pushpa The Rule ) మూవీ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.ఇప్పటికే బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసిన పుష్ప2 మూవీ మరో సంచలన రికార్డును సొంతం చేసుకుంది.

 Pushpa The Rule Movie Breaks Pawan Kalyan Kushi Record Details, Pushpa 2, Khusi-TeluguStop.com

సంధ్య థియేటర్ లో( Sandhya Theatre ) పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) రికార్డును బ్రేక్ చేయడం ద్వారా బన్నీ వార్తల్లో నిలిచారు.పవన్ కళ్యాణ్ 23 ఏళ్ల రికార్డ్ బ్రేక్ కావడం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.

సంధ్య థియేటర్ లో పవన్ ఖుషి( Khusi Movie ) అప్పట్లో ఏకంగా కోటీ 56 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.

అయితే 23 సంవత్సరాల తర్వాత ఈ రికార్డ్ బ్రేక్ కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

పుష్ప ది రూల్ మూవీ 24 రోజుల్లో ఏకంగా కోటీ 59 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ విధంగా సులువుగానే పుష్ప2 సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

స్టార్ హీరో అల్లు అర్జున్ అరుదైన రికార్డులను సొంతం చేసుకోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.

Telugu Allu Arjun, Khusi, Pawan Kalyan, Pushpa, Pushpa Rule, Sandhya Theatre-Mov

పుష్ప ది రూల్ సరికొత్త రికార్డులు కొనసాగుతున్నాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలతో సైతం సంచలనాలు సాధిస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.పుష్ప ది రూల్ అల్లు అర్జున్( Allu Arjun ) కెరీర్ లో ఒక స్పెషల్ సినిమాగా నిలిచిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

పుష్ప ది రూల్ రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Telugu Allu Arjun, Khusi, Pawan Kalyan, Pushpa, Pushpa Rule, Sandhya Theatre-Mov

పుష్ప ది రూల్ నార్త్ లో సైతం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను అందుకుంది.సీడెడ్ లో ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి బన్నీ మార్కెట్ ఏపాటిదో చెప్పకనే చెప్పేసింది.సంక్రాంతి సినిమాలు థియేటర్లలో విడుదలయ్యే వరకు పుష్ప ది రూల్ సినిమాదే హవా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube