ప్రస్తుతం అల్లు అర్జున్(Allu Arjun) పేరు పాన్ ఇండియా స్థాయిలో మారు మోగిపోతుంది.ఒకవైపు ఈయన నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
అదే విధంగా మరోవైపు ఈయన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా అరెస్ట్ కావడం బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అయితే అల్లు అర్జున్ కారణంగానే ఆయన పబ్లిసిటీ పిచ్చితోనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది అంటూ ఈ విషయంలో సీరియస్ అయిన తెలంగాణ సర్కార్ ఏకంగా అసెంబ్లీలో కూడా అల్లు అర్జున్ ప్రస్తావనకు తీసుకువచ్చింది దీంతో అల్లు అర్జున్ సైతం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఇలా బెయిల్ మీద ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించడం పట్ల కొందరు ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.ఇకపోతే అల్లు అర్జున్ కారణంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎత్తున చిక్కులే వచ్చాయని చెప్పాలి.ఈ ఘటనతో ఏకంగా తెలంగాణలో బెనిఫిట్ షోలు అలాగే టికెట్ల రేట్లు పెంచడం వంటివి కూడా కుదరదనే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇటీవల ఇండస్ట్రీ పెద్దల భేటీలో తేల్చి చెప్పారు.
ఈ క్రమంలోనే పలువురు అల్లు అర్జున్ తీరుని విమర్శిస్తున్నారు.ఇలాంటి తరుణంలోనే బన్నీ అభిమానులు సైతం సోషల్ మీడియా వేదికగా రష్మిక (Rashmika) పై విమర్శలు కురిపిస్తున్నారు.సంధ్యా థియేటర్(Sandhya Theatre) తొక్కిసలాట జరిగినప్పుడు కేవలం అల్లు అర్జున్ మాత్రమే అక్కడ లేరని రష్మిక కూడా అల్లు అర్జున్ వెంటే ఉంది.మరి ఆమెను ఎందుకు అరెస్ట్ చేయలేదు? తనపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.చట్టం తన పని తాను చేసుకుపోతే రష్మికను కూడా అరెస్టు చేసి లోపల ఎయ్యండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.అదే విధంగా అల్లు అర్జున్ ప్రస్తుతం కేసులు పోలీస్ విచారణలంటూ ఇబ్బంది పడుతుండగా ఈమె మాత్రం తన రూమర్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ లకు వెళ్లడానికి కూడా బన్నీ ఫాన్స్ తప్పుపడుతున్నారు.