సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీసుకున్నటువంటి నిర్ణయం సినిమా సెలబ్రిటీలకు జీర్ణించుకోలేనిదని చెప్పాలి.తాను ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజులన్నీ కూడా తెలంగాణలో బెనిఫిట్ షోలు అదే విధంగా సినిమా టికెట్ల రేట్లు పెంచడం అనేది ఉండదని తేల్చి చెప్పారు.
ఇలా అసెంబ్లీలో ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల కొంతమంది సినీ పెద్దలు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.ఇక ఈ భేటీలో కూడా రేవంత్ రెడ్డి తాను ఇచ్చిన మాట మీదే నిలబడి ఉన్నానని తన నిర్ణయం మార్చుకోనని తెలియజేశారు.
ఈ విధంగా రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం కారణంగా ఎంతో మంది నిర్మాతలు నష్టపోతారు.అయితే రేవంత్ రెడ్డి నిర్ణయంతో కొంతమంది సీనియర్ సెలబ్రిటీలు అల్లు అర్జున్ (Allu Arjun) హీరోని తప్పుపడుతూ ఆయనపై విమర్శలు కురిపిస్తున్నారు.ఈ క్రమంలోనే సీనియర్ నటుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ (Thamma reddy Bhardwaj) సైతం ఇదే అంశం గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ పట్ల విమర్శలు కురిపించారు.
ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ్(Thamma reddy) మాట్లాడుతూ.ఒక్క మనిషి కోసం.ఆయన మర్డర్ చేశాడని నేను అనడం లేదు.
అయితే తప్పు అయితే జరిగింది.రోడ్ షో చేయడం వల్ల తెలియకుండా ఈ ఘటనకు ఆయన బాధ్యుడు అయ్యారు.
ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆయన మరికొన్ని తప్పులు చేయటం వల్ల నేడు సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలందరూ కూడా ముఖ్యమంత్రి ముందు కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది.ఒక మనిషి కోసం అతని ఇగో కోసం ఇంతమంది తల వంచాల్సిన పరిస్థితి ఎదురైందని అల్లు అర్జున్ విషయంలో తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.