ప్రముఖ సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్( Bandla Ganesh ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా పలు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించిన బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారారు.ఈయన నిర్మాతగా పలువురు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు.
ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ గత కొంతకాలంగా సినిమాలకు కూడా దూరంగా ఉన్నారు.కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల గురించి రాజకీయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియా వార్తలు నిలుస్తున్నారు.
ఇక బండ్ల గణేష్ అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది పవన్ కళ్యాణ్.

ఈయన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు వీరాభిమాని.పవన్ కళ్యాణ్ దేవుడని తాను భక్తుడిని అంటూ పవన్ కళ్యాణ్ పట్ల ఈయన ఎంతో భక్తిని చూపిస్తూ ఉంటారు.ఏ వేదిక ఎక్కిన మైక్ చేతి పట్టిన పవనేశ్వర అంటూ పవన్ గురించి గొప్పగా చెబుతూ ఉంటారు.
అలాంటిది గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన అంశాల గురించి బండ్ల గణేష్ పెద్దగా స్పందించడం లేదని తెలుస్తోంది.అందుకు కారణం పరోక్షంగా త్రివిక్రమ్( Trivikram ) అంటూ ఈయన పలు సందర్భాలలో వెల్లడించారు.

నా దేవుడి నుంచి నన్ను కొని దుష్టశక్తులు దూరం చేస్తున్నాయి అంటూ పరోక్షంగా త్రివిక్రమ్ గురించి చెప్పారే తప్ప అసలు కారణం ఏంటి అనేది మాత్రం ఎక్కడా వెల్లడించలేదు.ఇక పవన్ ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు.అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ ఎక్కువగా స్పందించడం లేదు అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఈయన చేసిన పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా బండ్ల గణేష్ స్పందిస్తూ.
నా సమస్య ఏమిటంటే ఎదుటి వారి గురించి ఎక్కువగా ఆలోచించడం.వారి నుంచి ఎక్కువ ప్రేమను ఆశించడం.
వారిపై ఎక్కువ ప్రేమను చూపించడం.వారి గురించి ఎక్కువగా కేర్ తీసుకోవడం.
గుడ్డిగా నమ్మేయటం.చివరికి నాకు మిగిలేది మాత్రం నిరాశ.
బాదే నాలో ఉన్న అతిపెద్ద సమస్య ఇదే అంటూ ఈయన చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.దీంతో నేటిజన్స్ ఈయన ఎవరిని గుడ్డిగా నమ్మి బాధపడ్డారు? ఎవరు తనని అంతగా మోసం చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.