టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలే చేసినా మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్లలో రేఖా భోజ్ ఒకరు.యూట్యూబర్ ప్రసాద్ బెహరా ( YouTuber Prasad Behara )గురించి పరోక్షంగా ఈ హీరోయిన్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ హాట్ టాపిక్ అవుతోంది.
అతడికి నోటి దూల చాలా ఎక్కువ అనే క్యాప్షన్ తో రేఖా భోజ్ ( Rekha Bhoj )ఈ పోస్ట్ పెట్టారు.రేఖా భోజ్ తన పోస్ట్ లో నా మొదటి మూవీ కాలాయా తస్మై నమః రిలీజైన సమయంలో నా యాక్టింగ్ బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారని ఆమె పేర్కొన్నారు.
నా మొదటి సినిమా కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నానని సినిమాలో యాక్ట్ చేసిన వాళ్లమంతా థియేటర్ దగ్గర ఉండి షో అయ్యాక థ్యాంక్స్ చెబుతూ ఉన్నామని ఆమె తెలిపారు.నేను ఇంట్లో పూజ చేసి పులిహోర ప్రసాదం తెచ్చానని మా డైరెక్టర్ గారికి ఒక బాక్స్ లో పులిహోర ఇచ్చానని రేఖా భోజ్ అన్నారు.
డైరెక్టర్ గారు అందరి ముందు ఒక్కడిని తినను అంటే రండి మీ కార్ లో కూర్చోండి అక్కడ తినండి అన్నానని రేఖాభోజ్ పేర్కొన్నారు.
మేమంతా మంచి స్నేహితులమని అందులో నటించిన అందరూ కూడా మేము కార్లో ఉండగా చూశారని ఆమె పేర్కొన్నారు.ఆ సినిమాలో చిన్న రోల్ చేసిన వ్యక్తి మాత్రం వైజాగ్ ఫిల్మ్ గ్రూప్స్( Vizag Film Groups ) లో “ఇటీవల విడుదలైన ఒక సినిమా డైరెక్టర్ హీరోయిన్ థియేటర్ దగ్గర కార్లోకి దూరి బంచిక్ చేసుకున్నారు.ఇది చూసి థియేటర్ వాళ్లు వాళ్లను తిట్టి బయటకు పంపారు.
ఇలాంటి వాళ్ల వల్ల వైజాగ్ ఫిల్మ్ మేకర్స్ పరువు పోయింది” అని ప్రసాద్ బెహరా అబద్ధాలతో వాయిస్ మెసేజ్ పెట్టాడని ఆమె చెప్పుకొచ్చారు.
మా టీం అతనికి వార్నింగ్ ఇవ్వడంతో తాను తాగి మెసేజ్ పెట్టానని తప్పు చేశానని క్షమించండి అన్నాడని రేఖా భోజ్ వెల్లడించారు.అతను మారాడని లైఫ్ లో మెచ్యూరిటీ సాధించాడని అనుకున్నానని కానీ అదే నోటిదూలతో అతను అరెస్ట్ అయ్యాడని అమె చెప్పుకొచ్చారు.లూజ్ టంగ్ ఆరోగ్యానికి మంచిది కాదు బ్రదర్ అంటూ మన వైజాగ్ ఫిల్మ్ మేకర్స్ పరువు తీయకండి ప్లీజ్ అంటూ రేఖా భోజ్ పోస్ట్ ముగించారు.