అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు 

ఏపీలోని కూటమి ప్రభుత్వం అమరావతి( Amaravathi ) విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగానే ఆలోచిస్తోంది.ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భారీగా పెట్టుబడులను ఏపీకి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.

 Key Decisions On Amaravathi Development In Ap Cabinet Meeting Details, Ap Govern-TeluguStop.com

గత వైసిపి ప్రభుత్వం లో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో అప్పటి నుంచి టిడిపి ఈ విషయంలో పోరాటం చేస్తూనే వచ్చింది .ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ఎక్కువగానే ప్రాధాన్యం ఇస్తున్నారు.కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉండడం, నిధులకు అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో,  అమరావతిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి.తాజాగా అమరావతి పనులకు ఏపీ మంత్రివర్గ సమావేశం( AP Cabinet Meeting ) ఆమోదం తెలిపింది .ఈ పనులను మరింత వేగంగా పూర్తిచేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు.

Telugu Amaravathi, Ap, Cm Chandrababu, Deputycm-Politics

మూడేళ్లలో అన్ని పనులను పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.  కొత్త హైకోర్టు , అసెంబ్లీ,  సెక్రటరీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసి అమరావతి రూపు రేఖలు మార్చాలని భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే నిధులను సమీకరించి ఈ నెలలోనే టెండర్లను ఖరారు చేసి,వచ్చే నెల నుంచి పనులు పూర్తిస్థాయిలో మొదలు పెట్టేందుకు ప్రణాళికను రచించారు .అమరావతి లో మొత్తం 20 ఇంజినీరింగ్ పనులకు 8821 కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ఈ పనులు చేపట్టేందుకు 24316 కోట్ల రూపాయలు మంజూరు ప్రతిపాదనకు ఆమోదించారు.అమరావతి అభివృద్ధికి( Amaravathi Development ) హక్కు నుంచి 11,000 కోట్ల రూపాయలు కేఎఫ్ డబ్ల్యు నుంచి 16 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ఆమోదం లభించింది .

Telugu Amaravathi, Ap, Cm Chandrababu, Deputycm-Politics

దీంతో అమరావతిలో నిధుల సమస్య లేకుండా పనులు మరింత వేగవంతం అయ్యేలా అమరావతి పనులను పూర్తి చేయించాలని చంద్రబాబు( CM Chandrababu ) భావిస్తున్నారు.జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా అమరావతిని పూర్తిచేస్తే టిడిపికి తిరుగే ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.అందుకే వరుసగా సిఆర్డిఏ సమావేశాలు నిర్వహించడమే కాకుండా అధికారులను ఈ విషయంలో అలర్ట్ చేస్తూ , అభివృద్ధి పనులను వేగవంతం అయ్యేలా చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.ముందుగా రాజధాని నిర్మాణం పూర్తయితే భారీగా పెట్టుబడులు వస్తాయని , దాని ద్వారా ఏపీలో అభివృద్ధి సంక్షేమ పథకాల కు నిధుల కొరత ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.

  అందుకే ఈ విషయంలో తాను అలెర్ట్ గా ఉంటూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.  తాజా నిర్ణయాలతో అమరావతిలో అభివృద్ధి పనులు మరింతగా పరుగులు పెట్టనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube