అమరావతి పై కీలక నిర్ణయాలు.. ఇక పరుగులే పరుగులు 

ఏపీలోని కూటమి ప్రభుత్వం అమరావతి( Amaravathi ) విషయంలో చాలా ప్రతిష్టాత్మకంగానే ఆలోచిస్తోంది.

ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి భారీగా పెట్టుబడులను ఏపీకి తీసుకురావాలనే పట్టుదలతో ఉంది.

గత వైసిపి ప్రభుత్వం లో అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేయడంతో అప్పటి నుంచి టిడిపి ఈ విషయంలో పోరాటం చేస్తూనే వచ్చింది .

ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి ఎక్కువగానే ప్రాధాన్యం ఇస్తున్నారు.

కేంద్రం కూడా ఈ విషయంలో సానుకూలంగా ఉండడం, నిధులకు అన్ని విధాలుగా సహకరిస్తుండడంతో,  అమరావతిలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి.

తాజాగా అమరావతి పనులకు ఏపీ మంత్రివర్గ సమావేశం( AP Cabinet Meeting ) ఆమోదం తెలిపింది .

ఈ పనులను మరింత వేగంగా పూర్తిచేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. """/" / మూడేళ్లలో అన్ని పనులను పూర్తిచేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

అందుకే అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెంచేందుకు అనేక చర్యలు తీసుకున్నారు.  కొత్త హైకోర్టు , అసెంబ్లీ,  సెక్రటరీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయడమే కాకుండా రహదారుల సౌకర్యం ఏర్పాటు చేసి అమరావతి రూపు రేఖలు మార్చాలని భావిస్తున్నారు.

దీనిలో భాగంగానే నిధులను సమీకరించి ఈ నెలలోనే టెండర్లను ఖరారు చేసి,వచ్చే నెల నుంచి పనులు పూర్తిస్థాయిలో మొదలు పెట్టేందుకు ప్రణాళికను రచించారు .

అమరావతి లో మొత్తం 20 ఇంజినీరింగ్ పనులకు 8821 కోట్ల రూపాయలకు సంబంధించి పరిపాలన అనుమతులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ పనులు చేపట్టేందుకు 24316 కోట్ల రూపాయలు మంజూరు ప్రతిపాదనకు ఆమోదించారు.అమరావతి అభివృద్ధికి( Amaravathi Development ) హక్కు నుంచి 11,000 కోట్ల రూపాయలు కేఎఫ్ డబ్ల్యు నుంచి 16 వేల కోట్ల రూపాయల రుణం తీసుకోవడానికి ఆమోదం లభించింది .

"""/" / దీంతో అమరావతిలో నిధుల సమస్య లేకుండా పనులు మరింత వేగవంతం అయ్యేలా అమరావతి పనులను పూర్తి చేయించాలని చంద్రబాబు( CM Chandrababu ) భావిస్తున్నారు.

జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్పట్లోగా అమరావతిని పూర్తిచేస్తే టిడిపికి తిరుగే ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.

అందుకే వరుసగా సిఆర్డిఏ సమావేశాలు నిర్వహించడమే కాకుండా అధికారులను ఈ విషయంలో అలర్ట్ చేస్తూ , అభివృద్ధి పనులను వేగవంతం అయ్యేలా చంద్రబాబు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.

ముందుగా రాజధాని నిర్మాణం పూర్తయితే భారీగా పెట్టుబడులు వస్తాయని , దాని ద్వారా ఏపీలో అభివృద్ధి సంక్షేమ పథకాల కు నిధుల కొరత ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు.

  అందుకే ఈ విషయంలో తాను అలెర్ట్ గా ఉంటూ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

  తాజా నిర్ణయాలతో అమరావతిలో అభివృద్ధి పనులు మరింతగా పరుగులు పెట్టనున్నాయి.

ప్రధాని మోడీని కలిసిన ‘ Perplexity AI ’ సీఈవో .. ఎవరీ అరవింద్ శ్రీనివాస్ ?